Traffic Advisory: హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు..!

హైదరాబాద్: ఆగష్టు 15, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది ట్రాఫిక్ పోలీస్. గోల్కొండలోని రాణి మహల్ లాన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్వాంతంత్య్ర దినోత్సవ వేడులకలు నిర్వహిస్తోంది. దీంతో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హైదరాబాదులో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆ శాఖ పేర్కొంది.

ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా రామ్‌దేవ్ గూడా నుంచి గోల్కొండ కోటకు వెళ్లే మార్గంలో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు.ఇది కేవలం గోల్డ్, పింక్, బ్లూ కలర్ పాస్‌లు ఉన్న వారి వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఇక గోల్డ్, పింక్, బ్లూ కలర్ పాస్‌లు కలిగి సికింద్రాబాద్‌,బంజారా హిల్స్,మాసబ్ ట్యాంక్,మెహిదీపట్నం నుంచి వస్తున్నట్లయితే...వారంతా రేతిబౌలీ మరియు నానల్ నగర్ జంక్షన్ వద్దలెఫ్ట్ టర్న్ తీసుకుని బాలికా భవన్, లంగర్ హౌజ్ ఫ్లై ఓవర్, టిప్పు ఖాన్ బ్రిడ్జ్, రాందేవ్ గూడా జంక్షన్, మకాయ్ దర్వాజా మీదుగా గోల్కొండ ఫోర్ట్ గేట్‌కు చేరుకోవాలి.

Traffic Advisory:

ఇక D పాస్‌లు అంటే రెడ్ కలర్ పాసులు కలిగి ఉన్న ఆహ్వానితులు షేక్‌పేట్ నాలా,టోలీచౌకీ, సెవెన్ టూంబ్స్ సైడ్, బంజారా దర్వాజా మీదుగా ప్రియదర్శిని స్కూల్ గోల్కొండకు చేరుకుని వారి వాహనాలను ప్రియదర్శిని స్కూల్‌లో పార్క్ చేయాల్సి ఉంటుంది. E పాస్‌ అంటే సాధారణ ప్రజలు లంగర్ హౌజ్ ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చి యూటర్న్ తీసుకుని ఫతేదర్వాజా వద్ద ఉన్న హూడా పార్క్ వద్ద తమ వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుంది. షేక్‌పేట్, టోలీ చౌక్‌ల నుంచి వస్తున్న సాధారణ పబ్లిక్ సెవెన్ టూంబ్స్ వద్ద తమ వెహికల్స్‌ను పార్క్ చేయాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే సామాన్య ప్రజలకు టీఎస్‌ఆర్టీసీ ఉచితంగా గోల్కొండ కోటకు బస్సులు నడపనుంది. స్వాతంత్ర్య వేడుకలను గోల్కొండ కోటలో వీక్షించాలనుకునే వారు ఈ బస్సుల్లో ఉచితంగా వచ్చి ఉచితంగా తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లే ఏర్పాటు చేసింది టీఎస్‌ఆర్టీసీ.ఇక వేడుకలు ముగిశాక గోల్డ్, పింక్, బ్లూ కలర్ కార్ పాస్‌లు కలిగి ఉన్న వారు మకాయ్ దర్వాజా,రాందేవ్ ‌గూడా లంగర్‌హౌజ్‌ల మీదుగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. C కారు పాసులున్నవారు బడాబజార్, ఫతేదర్వాజా బంజారా దర్వాజా, సెవెన్ టూంబ్స్ మీదుగా ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది.

ఇక D కారు పాసులున్నవారు బంజారా దర్వాజా, సెవెన్ టూంబ్స్ మీదుగా ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. E పాస్ ఉన్న సామాన్య ప్రజలు ఎక్కడైతే పార్కింగ్ చేశారో అక్కడి నుంచే వెనుదిరిగి వెళ్లాల్సి ఉంటుంది.ఆహ్వానితులు తమకు అందిన కారుపాసులను తమ కారు విండ్‌షీల్డ్‌పై తప్పనిసరిగా అంటించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+