లక్ అంటే ఇదే.. హైదరాబాద్ వాచ్‌మన్‌కి తగిలిన రూ. 2 కోట్ల లాటరీ
దుబాయ్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న హైదరాబాద్ నగరానికి చెందిన వ్యక్తికి లాటరీ రూపంలో భారీ అదృష్టం వరించింది. హైదరాబాద్‌కు చెందిన 60 ఏళ్ల నాంపల్లి రాజమల్లయ్య.. దుబాయ్‌లో ఓ భవనానికి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు తరచూ లాటరీ టికెట్ కొనే అలవాటు ఉంది. ఆ అలవాటులో భాగంగానే బిట్ టికెట్ అనే లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.
ఈసారి మాత్రం అతడ్ని అదృష్ట లక్ష్మి వెతుక్కుంటూ వచ్చింది. అతడు కొన్న టికెట్‌కే లాటరీ తగిలింది. ఇటీవల అనౌన్స్ చేసిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు రాజమల్లయ్య. ఈ లాటరీ లక్కా డ్రాలో రాజమల్లయ్య ఏకంగా వన్ మిలియన్ దిర్హామ్స్ అంటే మన దేశ కరెన్సీలో 2 కోట్ల32 లక్షల 76వేల 460 రూపాయలు. దీంతో రాజమల్లయ్య ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయారు.

ఏకంగా రెండు కోట్ల లాటరీ తగలడంతో రాజమల్లయ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గత 30 ఏళ్లుగా తాను లాటరీ టికెట్లు కొంటున్నట్లు రాజమల్లయ్య తెలిపారు. ఎట్టకేలకు తనకు ఇప్పుడు పెద్ద మొత్తంలో లాటరీ తగలడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ప్రైజ్ మనీలో కొంత మొత్తాన్ని తాను టికెట్ కొనుగోలు చేసేందుకు సాయం చేసిన తన స్నేహితులతో పంచుకుంటానని రాజమల్లయ్య తెలిపారు. మిగితా మొత్తాన్ని తన కుటుంబ భవిష్యత్తు కోసం ఉపయోగిస్తానని రాజమల్లయ్య తెలిపారు. తాను గత మూడు దశాబ్ధాలుగా లాటరీ కొంటున్నా.. తనకు తన కుటుంబం ఎప్పుడూ అండగా నిలిచిందని చెప్పారు.












Click it and Unblock the Notifications