ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ దుండగుల కాల్పులు.. హైదరాబాద్ యువకుడు మృతి!

Trump Inauguration: అమెరికా అధ్యక్షుడు గా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ ఊహించని షాకింగ్ పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ భారీ బందోబస్తు కొనసాగుతున్న వాషింగ్టన్ లో కాల్పులు చోటు చేసుకోవడం షాక్ కు గురి చేసింది. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మరో తెలంగాణ విద్యార్థి దుండగుల కాల్పులలో మృతి చెందాడు.

యూఎస్ లో దుండగుల కాల్పులు.. హైదరాబాదీ మృతి
ఇప్పటికే నెలరోజుల క్రితం తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి దుండగుల కాల్పులలో మృతి చెందగా తాజాగా మరో హైదరాబాదీ యువకుడు దుండగుల కాల్పులలో మృతి చెందడంతో ఆ యువకుడి కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ చైతన్యపురి పరిధిలో ఆర్కే పురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్డు నెంబర్ 2 లో నివసిస్తున్న కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ 2022 మార్చి నెలలో యూఎస్ వెళ్ళాడు.

Trump Inauguration Hyderabad young man killed in washington by gun fire when Trump taking oath day

కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు
అక్కడ తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగం కోసం అన్వేషణలో ఉన్నాడు. కొడుకు ఉద్యోగం వచ్చి స్థిర పడతాడని తల్లిదండ్రులు భావించిన వేళ ఊహించని ఘటనలో రవి తేజ మృతి చెందటం ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. తాజాగా వాషింగ్టన్ లో దుండగులు జరిపిన కాల్పులలో రవితేజ మృతి చెందాడు. ఇక ఈ సమాచారంతో రవితేజ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

గత నవంబర్ లో ఖమ్మం వాసి మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి చదువు పూర్తిచేసే ఉద్యోగాన్వేషణలో ఉన్న రవితేజ మృతి చెందడం తో అక్కడ ఉన్న తెలుగు వారు తీవ్రభయాందోళనలో ఉన్నారు.
ఇదిలా ఉంటే గత ఏడాది నవంబర్ నెలలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ఖమ్మం జిల్లా వాసి మృతి చెందాడు. అమెరికాలోని చికాగోలో దుండగుల కాల్పులలో సాయితేజ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

వరుస మరణాలతో ఇండియన్స్ బెంబేలు
ఎంఎస్ చదవడానికి యుఎస్ వెళ్లిన అతను సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. అతనిపై దుండగులు కాల్పులు జరపగా సాయి తేజ మృతి చెందాడు. సాయి తేజ మరణంతో అతని కుటుంబం తీవ్ర విషాదాన్ని చూసింది. ఇప్పుడు హైదరాబాదీ అయిన రవితేజ మరణించడంతో అతని కుటుంబంలోనూ విషాదం చోటుచేసుకుంది. ఇక యూఎస్ లో ఇండియన్స్ వరుస మరణాలతో అక్కడ ఉంటున్న వారు ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+