వామ్మో.. ఆ 10 రెస్టారెంట్స్ లో కుళ్లిన మాంసం, ఎలుకలు, బొద్దింకలు.. పెద్ద జూపార్కే ఉందే..!
ప్రస్తుతం ప్రజలు ఫుల్ బిజీ లైఫ్ గడుపుతున్నారు. ప్రస్తుత జీవనశైలి, ఉద్యోగాల టైమింగ్ దృష్ట్యా ఇంట్లో వంట చేసుకుని తినే భాగ్యం లేకపోయింది. ఈ క్రమంలో టైమ్ లేక చాలామంది బయటే తినేస్తున్నారు. ఈ క్రమంలో మహానగరంలోని ఫాస్ట్ ఫుడ్స్, హోటల్స్, రెస్టారెంట్లు, చిరు బండ్ల వద్ద ఏ టైమ్ లో చూసినా రద్దీగానే ఉంటుంది. అయితే ప్రస్తుతం కల్తీ ఆహారాలకు అడ్డాగా హైదరాబాద్ మారుతోంది. ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా లాభాల కోసం దందా నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని అబ్సొల్యూట్ బార్బెక్యూ రెస్టారెంట్లపై ఆహార భద్రతా అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
Food Safety Task Force & FSOs inspected 10 Absolute Barbeque outlets in Hyderabad (AS Rao Nagar, Kompally, Medipally, Banjara Hills, Jubilee Hills, Gachibowli, Inorbit, Miyapur, Vanasthalipuram, Secunderabad) on 09.09.25 based on a complaint raised to Commissioner, Food Safety# pic.twitter.com/yXngpLJFBH
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) September 9, 2025
రాష్ట్రంలోని హైదరాబాద్ తో పాటు ప్రధాన పట్టణాల్లో ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో ఫుడ్ ట్రక్‌లు, తోపుడు బండ్లు, హోటల్స్, రెస్టారెంట్లు పెరిగిపోతున్నాయి. వాటిలో తినే ఆహారం రంగురంగులతో కనిపిస్తూ నోరూరిస్తాయి. అయితే ఆ ఆహార పదార్థాల్లో నాణ్యత ఎంత..? వాటిని ప్రమాణాల ప్రకారమే తయారు చేశారా..? అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. తాజాగా హైదరాబాద్ లోని అబ్సొల్యూట్ బార్బెక్యూ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు.
అబ్సొల్యూట్ బార్బెక్యూ రెస్టారెంట్ 10 బ్రాంచులు అయిన ఏఎస్ రావు నగర్, కొంపల్లి, మేడిపల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, ఇన్ ఆర్బిట్, మియాపూర్, వనస్థలిపురం, సికింద్రాబాద్ అవుట్‌లెట్లలో ఈ దాడులు జరిగాయి. కుళ్లిన మాంసం, కిచెన్ ర్యాక్స్ లో ఎలుకల మలం, మురికి పాత్రలు, అపరిశుభ్రంగా ఫ్రిడ్జ్ లు , బొద్దింకలు, బూజు, కుళ్లిపోయిన పండ్లను గుర్తించారు. అధికారులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, సంబంధిత అవుట్‌లెట్లకు నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆహార కల్తీ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత, ప్రమాణాల చట్టం- 2006ను తీసుకొచ్చింది. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగం తదితర అంశాలకు సంబంధించిన ప్రమాణాలను ఇది సూచిస్తుంది. ఆహార భద్రతా విభాగం ఈ చట్టం అమలును పర్యవేక్షించాల్సి ఉన్నా పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ 2020 ప్రకారం పాటించాల్సిన లేబులింగ్, డిస్ ప్లే రూల్స్ నూ ఈ రెస్టారెంట్స్ ఉల్లంఘించినట్లు తేలింది. నగరంలో కల్తీ ఆహారం ఎక్కడ పట్టుబడ్డా, భారతీయ న్యాయ సంహితలోని 274, 275 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications