హైదరాబాద్ తొలి డబుల్ డెక్కర్ కారిడార్: నిర్మాణ విశేషాలివే; వారి ట్రాఫిక్ కష్టాలకు చెక్!!

తెలంగాణ రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్ లో తొలి డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి అని చెబుతున్నారు. నాగపూర్ మహానగరంలో నిర్మించినట్టుగా తెలంగాణలోనూ ఏర్పాటు చేస్తే వాహనదారుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టినట్టు అవుతుందని చెబుతున్నారు.

జాతీయ రహదారి ఎన్ హెచ్ 44 పై 1580 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 5.32 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శ్రీకారం చుడుతున్నారు. కండ్లకోయ జంక్షన్ సమీపంలో నేడు శంకుస్థాపన తో ఎలివేట్ కారిడార్ పనులను మొదలు పెడుతున్నారు. ఎన్ హెచ్ 44పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

Hyderabad s First Double Decker Corridor Construction Highlights Check for traffic problems

ఎన్ హెచ్ 44 పై సికింద్రాబాద్లోని ప్యారడైజ్ జంక్షన్ నుండి మొదలై, తాడ్ బంద్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డైరీ ఫామ్ రోడ్డు వద్ద కారిడార్ ముగుస్తుంది. ఈ మొత్తం కారిడార్లో ఎలివేటెడ్ కారిడార్ 4.65 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇక అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.6 కిలోమీటర్లు ఉంటుంది. ఇది బేగంపేట విమానాశ్రయం సమీపంలో నిర్మాణం అవుతుంది.

మొత్తం ఆరు వరుసలలో ఈ కారిడార్ ను నిర్మిస్తారు. 131 స్తంభాలతో నిర్మాణమవుతున్న ఈ ఎలివేటెడ్ కారిడార్లో బోయినపల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా రెండు చోట్ల ర్యాంపులు నిర్మిస్తారు. ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్ పై మెట్రో మార్గాన్ని నిర్మిస్తారు. మొత్తం ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి 73.16 ఎకరాల భూమి అవసరం అవుతుంది.

ఇరుకైన రహదారులు ఉండి, వాహన రద్దీ ఎక్కువగా ఉండే ప్యారడైజ్ జంక్షన్ వంటి ఇతర కూడళ్ళలో ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వల్ల వాహనదారుల ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. వారి ప్రయాణం సాఫీగా సాగడంతో పాటు, సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యకు శాశ్వత విముక్తి దొరుకుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+