Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్.. హైడ్రా కమీషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్లో హైడ్రా ప్రకంపనలు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలలోనూ ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన భూములను పరిరక్షించడం కోసం ఏర్పాటుచేసిన హైడ్రా వ్యవస్థ చాలా బలంగా పని చేస్తుంది. ఎంతటి బలవంతులైన సరే ఆక్రమణలతో భవన నిర్మాణాలు చేశారంటే బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు.

ఓవైసీని టార్గెట్ చేస్తున్న బీజేపీ
కాంగ్రెస్ పార్టీ నేతలైనా, మంత్రులైనా సరే వెనక్కి తగ్గేది లేదని హైడ్రా తేల్చి చెప్పింది ముఖ్యంగా నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇక ఇదే సమయంలో సకలం చెరువులో నిర్మించిన ఓవైసీ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని గత నాలుగైదు రోజులుగా బిజెపి హైడ్రాని కోరుతుంది.

Hydra Next Target Fix Hydra Commissioner Ranganath Sensational Comments

హైడ్రా కమీషనర్ సంచలన వ్యాఖ్యలు
అయితే తాజాగా కూల్చివేతలపైన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమయం ఇస్తున్నామని మాత్రమే ఆయన తెలిపారు. ఓవైసీ విద్యాసంస్థలను కూల్చివేయడం పక్కా అన్న అభిప్రాయాన్ని రంగనాథ్ వ్యక్తం చేశారు. ఓవైసీ మల్లారెడ్డి అయినా ఒకటే రూల్ అంటూ మల్లారెడ్డి పేరును కూడా జత చేశారు.

విద్యార్థులను దృష్టిలో పెట్టుకునే ఆగుతున్నాం
దీంతో త్వరలోనే వీరి అక్రమ నిర్మాణాల పైన కొరడా ఝుళిపించడానికి సిద్ధమవుతున్నట్టుగా, అందుకు టార్గెట్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ను బిజెపినేతలు కలిసి ఓవైసీ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరిన సందర్భంగా రంగనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం కొనసాగుతుందని విద్యార్థులు రోడ్డున పడకూడదు అని ఆలోచిస్తున్నామని, అకాడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులు నష్టపోతారని రంగనాథ్ పేర్కొన్నారు.

సమయం ఇస్తున్నాం.. అక్రమ నిర్మాణాలు వాళ్ళే తొలగించాలి .. లేదంటే
ఇక అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వారికే సమయం ఇస్తున్నామని, ఈలోపు వాళ్లకు వాళ్ళే తొలగించకపోతే హైడ్రా చర్యలు తీసుకుంటుందని రంగనాథ్ హెచ్చరించారు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఆక్రమిస్తే ఊరుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇక తాజా వ్యాఖ్యలతో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ అయింది అన్నది ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న చర్చ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+