హైడ్రాలో ఉద్యోగాలకు ఫిజికల్ టెస్టులు ఆగస్టు 11 వరకు పొడిగింపు!

హైదరాబాద్‌లో నిరుద్యోగులకు హైడ్రా శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. హైడ్రాలో 150 పోస్టులను భర్తీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్న హైడ్రా ఎలాంటి రాత పరీక్షలు లేకుండా, ఫిజికల్ టెస్టులు మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాంట్రాక్ట్ పద్దతిలో పని చేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు సరూర్ నగర్ స్టేడియం కు రావాలని పేర్కొంది.

హైడ్రా ఉద్యోగాల కోసం భారీగా అభ్యర్థులు

మొదట 8, 9 తేదీలు, రెండు రోజుల పాటు ఈ టెస్ట్ లు నిర్వహిస్తామని ప్రకటన చేసింది. దీంతో హైడ్రా నిర్వహిస్తున్న డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సరూర్నగర్ స్టేడియంలో జరుగుతున్న ఈ ఎంపిక ప్రక్రియకు వేలాది మంది హాజరు కావడంతో పరిస్థితి నియంత్రణలో లేకుండా పోయింది. ఒకదశలో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకురావాల్సి వచ్చింది.

HYDRAA jobs 100 DRF Assistants 50 Heavy Vehicle Drivers Physical tests extended till August 11

100 డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల భర్తీకి ఫిజికల్ టెస్ట్ లు

మొత్తం 150 పోస్టులు 100 డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్, 50 హెవీ వెహికల్ డ్రైవర్ భర్తీ చేయనున్నారు. వయస్సు 35 ఏళ్ల లోపు, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. డ్రైవర్ పోస్టుకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా పేర్కొన్నారు . ఎంపిక పూర్తిగా ఫిజికల్ పరీక్షల ఆధారంగానే జరుగుతుంది. 800 మీటర్ల పరుగు 170 సెకన్లలో, 100 మీటర్లు 15 సెకన్లలో, 4 మీటర్ల లాంగ్ జంప్, 7.2 కేజీల షాట్‌పుట్ 6 మీటర్లు విసరడం వంటి పరీక్షలు ఉన్నాయి.

ఫిజికల్ టెస్ట్ లు ఈ నెల 11వ తేదీ వరకు పొడిగింపు

మొదట ఆగస్టు 8, 9 తేదీల్లోనే పూర్తి చేయాలని అనుకున్నా, అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగి, అధిక సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో అధికారులు ప్రక్రియను ఈ నెల 11వ తేదీ వరకు పొడిగించారు. హాజరయ్యే ప్రతి ఒక్కరికీ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. లౌడ్ స్పీకర్ల ద్వారా అందరికీ అవకాశం ఇస్తామని ప్రకటించడంతో అభ్యర్థులు సహకరిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్ కు పోటెత్తిన దరఖాస్తులు.. నేడే ఆఖరు తేదీ, లాటరీ ఎప్పుడంటే!
హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్ కు పోటెత్తిన దరఖాస్తులు.. నేడే ఆఖరు తేదీ, లాటరీ ఎప్పుడంటే!

సరూర్ నగర్ స్టేడియం వద్ద కొనసాగుతున్న టెస్ట్ లు

తెలంగాణా రాష్ట్రంలో నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోసం చూపిస్తున్న ఆసక్తి ఈ హైడ్రా ఉద్యోగాల సెలెక్షన్స్ లో బాగా కనిపిస్తుంది. ప్రస్తుతం అధికారులు క్రమశిక్షణతో సరూర్ నగర్ స్టేడియం వద్ద ఫిజికల్ టెస్ట్ లను చేస్తూ, ప్రక్రియను సాగిస్తున్నారు. సరూర్ నగర్ స్టేడియం వద్ద నిరుద్యోగులు కూడా పూర్తిగా అధికారులకు సహకారం అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+