నేనూ తెలంగాణ బిడ్డనే, దూరం పెట్టొద్దు: నటి పూనమ్ కౌర్ కంటతడి
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ కంటతడి పెట్టుకున్నారు. తాను తెలంగాణలో పుట్టానని.. కానీ, తనని పంజాబీ అమ్మాయి అంటూ దూరం పెడుతున్నారని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.
హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ కంటతడి పెట్టుకున్నారు. తాను తెలంగాణలో పుట్టానని.. కానీ, తనని పంజాబీ అమ్మాయి అంటూ దూరం పెడుతున్నారని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. తాను తెలంగాణ బిడ్డనని.. అలా దూరం చేయవద్దని వాపోయారు. నా మతం పేరు చెప్పి నన్ను వెలివేయకండి. నేను తెలంగాణ బిడ్డనే అంటూ వేదికపై కంటతడి పెట్టుకున్నారు. సినీ పరిశ్రమలో ఎక్కువగా ముంబై నుంచి వచ్చినవారికే ప్రాధన్యాత ఇస్తున్నారని వాపోయారు.

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్యాయం జరుగుతోందని పూనమ్ కౌర్ అన్నారు. సినీ ఇండస్ట్రీలో ప్రాధాన్యత కావాలన్నారు. మరోవైపు, వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటనపైనా ఆమె స్పందించారు. ప్రీతికి న్యాయం జరగాలని అన్నారు. అంతకుముందు వేదికపై ఉన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అప్యాయంగా హత్తుకున్నారు పూనమ్ కౌర్.
కాగా, రాజ్‌భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. సినీ నటి, బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు, వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు ఈ సందర్భంగా పురస్కారాలు అందించారు.












Click it and Unblock the Notifications