రబ్బర్‌ స్టాంప్ గవర్నర్‌ను కాదు, పంపిన ప్రతిఫైలుపై సంతకం చేయను: కేసీఆర్‌తో కష్టమంటూ తమిళిసై

హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విభేదాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఓ మీడియా సంస్థతో గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ కీలక అంశాలపై స్పందించారు.

సీఎం పంపిన అన్ని సిఫార్సులను ఆమోదించలేను: గవర్నర్ తమిళిసై

సీఎం పంపిన అన్ని సిఫార్సులను ఆమోదించలేను: గవర్నర్ తమిళిసై

సీఎం చేసే అన్ని సిఫార్సులను అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి అంశాలను వ్యక్తిగత వ్యవహారాలను ఆపాదించవద్దని తమిళిసై సూచించారు. సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేయడం కష్టమని, పెద్ద సవాలేనని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతున్న వేళ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 'నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. సీఎం, గవర్నర్ మధ్య సత్సంబంధాలు ఉండాలి. అనేక విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎన్నో సిఫార్సులు చేస్తారు. వాటిలో అన్నింటినీ నేను ఆమోదించలేను. ఇది పూర్తిగా రాజ్యాంగపరమైన అంశం. రాజ్యాంగపరమైన హక్కులను ఉపయోగించి ఏదైనా విషయంలో గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటే.. అది నా విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయమే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్నట్లు భావించొద్దు అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పస్టం చేశారు.

గవర్నర్ నిర్ణయంపై వ్యక్తిగత విమర్శలు చేస్తారా?: తమిళిసై సౌందరరాజన్

గవర్నర్ నిర్ణయంపై వ్యక్తిగత విమర్శలు చేస్తారా?: తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులను గవర్నర్ ఆమోదించకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. కొన్ని ప్రొటోకాల్స్ ను కూడా ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని, విషయేదైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం తీసుకుంటే వివాదం చేయాల్సిన అవసరం లేదని, ఇలాంటి ఆలోచన విధానం సరైంది కాదని తమిళిసై తేల్చి చెప్పారు.

రాజ్యాంగపరమైన నిబంధనలు పాటించాలి: గవర్నర్ తమిళిసై

రాజ్యాంగపరమైన నిబంధనలు పాటించాలి: గవర్నర్ తమిళిసై

ఏం జరిగినా సరే వ్యవస్థలోని ఎస్ఓపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) పాటించడం తప్పనిసరి. సందర్భం, విషయం ఏదైనా సరే ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు రాజ్యాంగపరమైన నిబంధనలు పాటించాలి. అలా చేయడం ద్వారా రాజ్యాంగానికి గౌరవం ఇచ్చిన వాళ్లమవుతామని గవర్నర్ తమిళిసై చెప్పారు. పరస్పర గౌరవం, విషయాలను అర్థం చేసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని హితవు పలికారు.

రబ్బరు స్టాంప్ గవర్నర్‌ను కాదు, కేసీఆర్‌తో పనిచేయడం సవాలే: తమిళిసై

రబ్బరు స్టాంప్ గవర్నర్‌ను కాదు, కేసీఆర్‌తో పనిచేయడం సవాలే: తమిళిసై

సీఎం, గవర్నర్ కలిసి పనిచేయకపోతే ఎలా ఉంటుందో తెలంగాణను చూస్తే అర్థమవుతుందన్నారు. తాను ఇద్దరు వేర్వేరు సీఎంలతో పని చేస్తున్నానని.. ఇద్దరూ చాలా భిన్నమైనవారని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కొందరు ముఖ్యమంత్రులు నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్ ను కానని తేల్చి చెప్పారు తమిళిసై. సీఎం చెప్పారని ప్రతి ఫైల్‌పై సంతకం చేయనని స్పష్టం చేశారు. తనను వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తారనేది అవాస్తం అన్నారు. ఢిల్లీ వెళ్లిన వెంటనే తనపై అసత్య ప్రచారం చేశారని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+