ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ అయితే బాగుండు: కేంద్రం తీరును ఎండగడుతూనే ఉంటానన్న కేటీఆర్
హైదరాబాద్: తాజాగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కమర్షియల్ సిలిండర్ ధర రూ. 250కి పైగా పెరిగిందనే ఓ వార్త కథనంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు మంత్రి కేటీఆర్. ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ కావాలని సీరియస్‌గా తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
I am seriously hoping this is an April fools joke! https://t.co/9smrxq6jTt
— KTR (@KTRTRS) April 1, 2022
అంతేగాక, 'అచ్చే దిన్ దివస్'ను ఏప్రిల్ ఫూల్స్‌డేగా పోలుస్తూ చురకలంటించారు. ఇక, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ తాను పోస్టులు పెట్టిన ప్రతిసారీ ఇబ్బంది పడేవారు ట్విట్టర్‌లో తనను అనుసరించవద్దని కేటీఆర్ కోరారు. కేంద్రం, బీజేపీ మతతత్వ విధానాలు, దుష్ప్రచారాన్ని తాను ఎండగడుతూనే ఉంటానని కేటీఆర్ పేర్కొన్నారు.

కాగా, 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 250 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,253కు చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు పేర్కొన్నాయి.
ఏప్రిల్ కూల్ చేద్దామంటూ టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ ఏప్రిల్ 1న ఆలోచింపజేసే ట్వీట్ చేశారు. ఏప్రిల్ 1న ఎవరినైనా ఫూల్ చేయాలని ప్రయత్నించడం సాధారణమన్నారు సంతోష్ కుమార్. అయితే ఆల్ ఫూల్స్ డేని ఆల్ కూల్ డేగా మార్చేందుకు.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మీ పరిచయస్తులకు ఒక మొక్కను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచేందుకు ఎందుకు ఆలోచించకూడదని సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications