నేను సీఎం కాలేను: రేవంత్ రెడ్డి బకరా అవుతాడు: బండి సంజయ్!!
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలకు ప్రచారం హోరాహోరీగా సాగుతున్న వేళ బిజెపి ఎంపీ బండి సంజయ్ సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి పై తనకు మోజు లేదని పేర్కొన్న బండి సంజయ్ ఒకరిద్దరు చెప్పినంత మాత్రాన తాను సీఎం కాలేనని స్పష్టం చేశారు. బండి సంజయ్ అధిష్టానానికి కట్టుబడి ఉంటాడని ఆయన వెల్లడించారు.
ఇక తెలంగాణ కాంగ్రెస్ ను ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సీఎం పొగ గాంధీభవన్ ను తాకిందన్న ఆయన టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బకరా అవుతారని బండి సంజయ్ పేర్కొన్నారు. బీసీని సీఎం చేయని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ పార్టీ బీసీలకు 23 సీట్లు ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీ బీసీలకు 19 సీట్లు ఇచ్చిందని పేర్కొన్న బండి సంజయ్ ఆ రెండు పార్టీలు బీసీలకు వ్యతిరేకమంటూ ఆరోపించారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీతోనే బీసీ సీఎం కావడం సాధ్యమని తెలిపారు. బీసీలను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టు పై తనదైన విమర్శలు చేశారు.
క్షుద్ర పూజలు చేయడమే కాదు అప్పుడప్పుడు కట్టిన ప్రాజెక్టులు కూడా చూడాలని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అన్నారం పంప్ హౌస్ మునగటం జరిగిందని, ప్రాజెక్టు కుంగింది వాస్తవమని, పిల్లర్లకు పగుళ్లు వచ్చింది కూడా వాస్తవమేనని బీఆర్ఎస్ పై తనదైన శైలిలో మండిపడ్డారు.
కెసిఆర్ తిన్నదంతా కక్కిస్తామని పేర్కొన్న బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ తాత ఆస్తి కాదంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో కేటీఆర్ కు సవాల్ విసిరారు. నీ అయ్యను పట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు రా.. నిపుణులను కూడా రమ్మను అని సవాల్ కు సిద్ధమా అంటూ విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications