నీ అయ్యకు రాజకీయ భిక్ష పెట్టింది నేనే .. నన్నే బఫూన్ అంటావా ... కేటీఆర్ పై ఫైర్ అయిన వీహెచ్
Recommended Video
కేటీఆర్ , గ్లోబరీనా , మధ్యలో పెద్దమ్మ తల్లి వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతుంది.ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తిట్టిపోసుకుంటున్నారు. గ్లోబరీనా వివాదంలో పెద్దమ్మ గుడిలో ప్రమాణం చెయ్యాలని పిలిచిన వీహెచ్ ను కేటీఆర్ బఫూన్ తో పోల్చటం వీహెచ్ కు ఆగ్రహం తెప్పించింది. దీంతో వీహెచ్ తీవ్ర పదజాలంతో కేటీఆర్ పై విరుచుకుపడ్డారు.

గ్లోబరీనా విషయంలో పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చెయ్యమన్న వీహెచ్
గ్లోబరీనా సంస్థ తనకు తెలీదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ గ్లోబరీనా తెలీదని పెద్దమ్మ గుడిలో పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చెయ్యమని సవాల్ విసిరారు. పెద్దమ్మ గుడికెళ్ళి మరీ కేటీఆర్ కోసం నిరీక్షించారు . కానీ కేటీఆర్ రాలేదు. దీంతో వీహెచ్ తనదైన శైలిలో స్పందించి టీఆర్ ఎస్ ప్రభుత్వంపై శాపనార్ధాలు పెట్టారు.

బఫూన్ పిలిస్తే పోవాలా .. అన్న కేటీఆర్ వ్యాఖ్యపై నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇచ్చిన వీహెచ్
ఇక ఇదే విషయంపై స్పందించిన కేటీఆర్ వీహెచ్ ను బఫూన్ తో పోల్చారు. బఫూన్ పిలిస్తే నేను రావాలా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.దీంతో మరోమారు వీహెచ్ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. నీ అయ్యకు రాజకీయ భిక్ష పెట్టినవాడిని నన్నే బఫూన్ అంటావా అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్రవ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎంపీ వి.హన్మంతరావు.

నీ అయ్యకు రాజకీయ భిక్ష పెట్టింది నేనే .. నన్నే బఫూన్ అంటావా .. వీహెచ్ ఫైర్
కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అంతేకాదు మాట్లాడే భాష మార్చుకోవాలని, ఏది పడితే అది మాట్లాడితే జాగ్రత్త అంటూ కేటీఆర్ కు హితవు పలికారు వీహెచ్. సమయం వచ్చినప్పుడు ఎవరు బఫూనో చెప్తానని చెప్పుకొచ్చారు. గ్లోబరీనా సంస్థతో తన బావమరిదికి సంబంధం లేకుంటే కేటీఆర్ పెద్దమ్మ గుడికి ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ అంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిన నన్నే బఫూన్ అంటావా?అంటూ వీహెచ్ మండిపాటుకు గురయ్యారు.

హాజీపూర్ ఘటనపై స్పందించిన వీహెచ్ .. టీఆర్ఎస్ పాలనలో ఎవరికీ రక్షణ లేదని వ్యాఖ్య
మరోవైపు హాజీపూర్ ఘటనపై కూడా వీహెచ్ తీవ్రంగా స్పందించారు. హాజీపూర్ ముగ్గరు బాలికలను అతి దారుణంగా హత్య చేసిన మానవమృగం మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చెయ్యాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో ఎవరికీ రక్షణ లేదని ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు .
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications