మళ్లీ నేనే సీఎం అవుతా! రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం శాసనమండలి వాయిదా అనంతరం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానని స్పష్టం చేశారు. మొదటిసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యతిరేకతతోనే ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని రేవంత్ రెడ్డి చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో రెండోసారి మాత్రం తమ మీద నమ్మకంతో ప్రజలు ఓస్తారని సీఎం రేవంత్ చెప్పారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి ప్రజల వద్దకు వెళతామన్నారు. సంక్షేమ పథకా లబ్ధిదారులే తమ ఓటర్లు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తాను పనినిన నమ్ముుని ముందుకు వెళ్తున్నానని సీఎం రేవంత్ చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామన్నారు. స్టేచర్ కాదు.. స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. 25లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు. కోటి మంది మహిళలకు ఖచ్చితంగా లబ్ధి చేకూరుస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. వారంతా ఇప్పుడు మాట్లాడకపోయినా.. తమకే ఓటు వేస్తారన్నారు.
గతంలో తాను చెప్పింది జరిగింది.. భవిష్యత్‌లోనూ తాను చెప్పిందే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు వందశాతం బకాయిలు చెల్లిస్తామన్నారు. ఆదాయాన్ని పెంచి.. పేదలకు పంచడమే తమ విధానమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తొలిసారి బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతతో ప్రజలు తమకు ఓటేసినా.. రెండోసారి మాత్రం తమపై ప్రేమతో ఓటు వేస్తారని పునరుద్గాటించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. జనాభా లెక్కలపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలు అడిగిందని.. 2027లో జనాభా లెక్కలు నోటిఫై చేస్తారని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications