రేవంత్ రెడ్డి ముఖం ఇక చూడను - తప్పు చేశారు : వెంకటరెడ్డి ఫైర్ - అమిత్ షాతో భేటీ..!!

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త వివాదం రాజుకుంటోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తరువాత రాష్ట్రంలో మునుగోడు బై పోల్ పైన చర్చ సాగుతోంది. ఈ సమయంలో...సడన్ గా రేవంత్ రెడ్డి వర్సస్ కోమటిరెడ్డి అన్నట్లుగా వివాదం కొత్త టర్న్ తీసుకుంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినత తరువాత రేవంత్ రెడ్డి స్పందించిన తీరును ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుబట్టారు. తాను 34 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్నానని..తనను రెచ్చగొట్టేలా చేయవద్దంటూ వెంకటరెడ్డి హెచ్చరించారు.

Recommended Video

    Revanth Reddy కి క్యారెక్టర్ లేదు - Rajagopal Reddy *Telangana | Telugu Oneindia
    రేవంత్ వివరణ ఇచ్చినా...

    రేవంత్ వివరణ ఇచ్చినా...

    రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారని చెప్పుకొచ్చారు. దీని పైన ఈ ఉదయం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి మాత్రమే మాట్లాడానని.. వెంకటరెడ్డి గురించి మాట్లాడలేదని..తాను వివరణ ఇస్తున్నానంటూ తాను మాట్లాడిన అంశాలను వివరించారు. రాజగోపాల్ రెడ్డి ద్రోహి అని విమర్శిస్తూ.. వెంకటరెడ్డి కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్నారని.. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వీడారని చెప్పుకొచ్చారు. దీంతో..వెంకటరెడ్డి శాంతిస్తారని.. వివాదం ముగుస్తుందని భావించిన సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో అంశం తెర మీదకు తెచ్చారు.

    సుధాకర్ చేరికపై అభ్యంతరం

    సుధాకర్ చేరికపై అభ్యంతరం

    తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటంతో పాటుగా చెరుకు సుధాకర్ కాంగ్రెస్ లో చేరారు. దీనిని కోమటిరెడ్డి వెంకట రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. తనను ఓడించటానికి ప్రయత్నించిన సుధాకర్ ను పార్టీలోకి ఎలా తీసుకుంటారని వెంకటరెడ్డి ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నారని మండి పడ్డారు. పార్లమెంట్ సమావేశాల తరువాత మునుగోడు వెళ్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేసారు. ఇక తాను రేవంత్ రెడ్డి ముఖం చూడనని కొత్త శపథం చేసారు. దీని ద్వారా మునుగోడు ఎన్నికల ప్రచారంలో రేవంత్ తో కలిసి వెంకటరెడ్డి పాల్గొనే అవకాశాలు లేవనే విషయం స్పష్టం అవుతోంది.

    రేవంత్ తో ఇక కలిసేది ఉండదా

    రేవంత్ తో ఇక కలిసేది ఉండదా

    అయితే, అసలు మునుగోడులో పార్టీ అభ్యర్దికి మద్దతుగా వెంకటరెడ్డి ప్రచారం చేస్తారా లేదా అనేది ఇప్పుడు మరో సందుహం. ఇక, ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. ఆయన తాజా వరదల కారణంగా తెలంగాణకు జరిగిన నష్టం వివరించి..కేంద్రం నుంచి సాయం కోరేందుకే కలుస్తున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. దీంతో..ఇప్పుడు మునుగోడు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో అనే ఉత్కంఠకు కారణమవుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+