మా పదవులు: తెలంగాణలో ఐపీఎస్ వర్సెస్ ఐఏఎస్, కేసీఆర్‌కు షాక్
హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల మధ్య వివాదం కనిపిస్తోంది. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను నియమించడం పట్ల ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం పైన గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలవాలని ఐఏఎస్‌లు నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రితో అపాయింట్‌మెంట్ కావాలని ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు ఐఏఎస్‌లు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.

ఇప్పటికే పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను నియమించారు. ఇప్పటికే సాంఘీక సంక్షేమ శాఖలో ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పని చేస్తున్నారు. త్వరలో ట్రాన్సుపోర్టు కమిషనర్‌గా కూడా మరో ఐపీఎస్ అధికారిని నియమిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్‌లు సీఎంను కలిసి పూర్తి విషయాలు వెల్లడించాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications