రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తే..: హైదరాబాద్‌లో శశిథరూర్ ఎన్నికల ప్రచారం, ఆక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో ఉన్న ఎంపీ శశిథరూర్ హైదరాబాద్ నగరానికి వచ్చారు. నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్లో సమావేశం నిర్వహించారు. అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది అంతర్గత చర్చేనని శశిథరూర్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేతో పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీకి సమర్థ నాయకత్వం కావాలన్న శశిథరూర్

కాంగ్రెస్ పార్టీకి సమర్థ నాయకత్వం కావాలన్న శశిథరూర్

ఈ నేపథ్యంలోనే మద్దతు కూడగట్టేందుకు పార్టీలోని ముఖ్య నేతలతో శశిథరూర్ భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీలో తామంతా ఒక్కటేనని.. తమకు సిద్ధాంతపరంగా వైరుధ్యాలేమీ లేవని శశిథరూర్ ఈ సందర్భంగా తెలిపారు. బీజేపీని ఎలా ఎదుర్కోవాలనేదానిపైనే తామంతా చర్చిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు శక్తివంతులు అనేదే తమ ప్రధాన ప్రశ్ని అని అన్నారు.

అంతా ఒకటే అంటూనే.. తన విజన్ తనకుందన్న శశిథరూర్

అంతా ఒకటే అంటూనే.. తన విజన్ తనకుందన్న శశిథరూర్

పార్టీ ఫండమెంటల్ విషయాల్లో తనది, ఖర్గేది ఒకే విధానమన్నారు. ఇటీవలే తాను ఖర్గేతో మాట్లాడానని.. ఆయన ఒక గొప్ప నేత అని శశిథరూర్ కొనియాడారు. ఖర్గేతో తనకు మంచి సంబంధాలున్నాయని వివరించారు. మల్లిఖార్జున్ ఖర్గే దళిత నాయకుడుగా పరిమితం కాలేదని తెలిపారు. ఖర్గే విజయన్ ఖర్గేకు ఉందని.. తన విజన్ తనకు ఉందని శశిథరూర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో జీ23 అనేదే లేదన్నారు. పార్టీ నాయకత్వాన్ని సెంట్రలైజేషన్ చేయాల్సి ఉందని ఆయన అన్నారు

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలంటూ శశిథరూర్..కానీ,

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలంటూ శశిథరూర్..కానీ,

తనకు తెలంగాణ పార్టీ నాయకులతో మంచి సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు. రేవంత్ రెడ్డి తన ఇంటికి ఆహ్వానించారని.. తానే వెళ్లలేకపోయానని తెలిపారు. అయితే, రేవంత్ రెడ్డి పిలిస్తే తప్పకుండా గాంధీ భవన్ వచ్చి ప్రచారం చేసుకుంటానని శశిథరూర్ చెప్పారు. తాను హైదరాబాద్‌లో కొందరు నేతలను వేరువేరుగా కలవబోతున్నట్లు ఆయన తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బరిలో మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే, టీపీసీసీతోపాటు మెజార్టీ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే నాయకత్వానికే మొగ్గుచూపుతుండటం గమనార్హం. మల్లిఖార్జున నాయకత్వాన్ని అంగీకరిస్తూ శశిథరూర్ పోటీ నుంచి తప్పుకుంటే బాగుంటుందని టీ కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఇప్పటికే వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+