‘మునుగోడు’లో గెలవకుంటే రాజీనామా చేస్తానంటూ బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలనం
నిజామాబాద్: మునుగోడు ఉపఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ నేత, బోధన్ ఎమ్మెల్యే మొహ్మద్ షకీల్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఒకవేళ మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు షకీల్. మునుగోడు ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కనీసం డిపాజిట్ కూడా దక్కదని షకీల్ అన్నారు.

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో 'మన ఊరు-మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో షకీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే షకీల్ మాట్లాడారు. రాష్ట్రంలోని 119 సీట్లలో 103 ఎమ్మెల్యేలను కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు.
దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో లేనంత బలమైన ప్రభుత్వాన్ని తెలంగాణలో టీఆర్ఎస్ నెలకొల్పిందని షకీల్ అన్నారు. ఇలాంటి బలమైన ప్రభుత్వాన్ని కూలదోసే యత్నాలకు బీజేపీ పాల్పడుతోందని మండిపడ్డారు. అయితే, బీజేపీ కుట్రలు తెలంగాణలో సాగవని వ్యాఖ్యానించారు.
కాగా, నలుగురు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందంటూ టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ముగ్గురు వ్యక్తులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందని ఫాంహౌస్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ కావడం రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే.
Get Ready for Rajinama.. Bodhan MLA Shakeel Comments on Munugodu Elections.. @Arvindharmapuri @TeenmarMallanna @bandisanjay_bjp @RaghunandanraoM @revanth_anumula pic.twitter.com/mz3pivOrfd
— Praveen Dyagala (@praveen_dyagala) October 27, 2022












Click it and Unblock the Notifications