తెలంగాణలో గెలిస్తే కాంగ్రెస్ కు రాష్ట్రాల్లో ఆ అరుదైన రికార్డు !
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పేశాయి. మెజార్టీ సీట్ల సంఖ్యలో తేడా ఉన్నా అంతిమంగా కాంగ్రెస్ గెలుపు కష్టమని ఏ ప్రముఖ సర్వే కూడా చెప్పలేకపోయింది. దీన్ని బట్టి చూస్తే ఎల్లుండి జరిగే ఓట్ల లెక్కింపు లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధిస్తుందని అంచనా వేసుకుంటే తద్వారా ఆ పార్టీ సాధించబోయే ఓ అరుదైన రికార్డు గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది.
ఉమ్మడి ఏపీలో వరుసగా రెండు పర్యాయాలు అధికారం అనుభవించిన కాంగ్రెస్ పార్టీ 2014లో రాష్ట్ర విభజన తర్వాత మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రాలేకపోయింది. ఏపీలో టీడీపీకి అధికారం అప్పగించిన తర్వాత ఇప్పటివరకూ మరోసారి ఆ ఊసే లేకుండా పోయింది. తెలంగాణలో అప్పట్లో టీఆర్ఎస్ కు, ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారం అప్పగించిన తర్వాత ఇప్పటివరకూ అధికారంలోకి రావడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఇప్పుడు గెలిస్తే పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ఓ తెలుగు రాష్ట్రాన్ని గెలిచినట్లవుతుంది. అంతేకాదు మరో కీలక రికార్డు కూడా సాధించబోతోంది.

దేశవ్యాప్తంగా ఒకప్పుడు వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మాత్రం ప్రాంతీయ పార్టీలకు, తోటు జాతీయ పార్టీలకు అధికారం కోల్పోతూ వచ్చింది. ఇలా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ, జాతీయ పార్టీలకు అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని చోట్ల మాత్రమే తిరిగి వారి నుంచి అధికారం కాంగ్రెస్ చేతికి వచ్చింది. అదీ తోటి జాతీయ పార్టీ అయిన బీజేపీ నుంచి మాత్రమే అధికారం తిరిగి కాంగ్రెస్ సొంతమైంది. కానీ ప్రాంతీయ పార్టీలకు ఓసారి అధికారం అప్పగించి తర్వాత మాత్రం చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తిరిగి దాన్ని తన సొంతం చేసుకోలేకపోయింది.
ఉదహరణకు బీహార్, బెంగాల్, ఒడిశా, తమిళనాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రికార్డు చాంతాడంత ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అరుదైన రికార్డు సాధించే ఛాన్స్ వచ్చింది. గతంలో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ కు కోల్పోయిన అధికారాన్ని తిరిగి పదేళ్ల తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో సాధించబోతోంది. రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రభావమో, కర్నాటకలో కాంగ్రెస్ విజయమో, లేక మరేదైనా కారణమో కానీ తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ప్రాంతీయ పార్టీకి గతంలో అప్పగించి అధికారం తిరిగి సాధించుకున్న అరుదైన రికార్డు మాత్రం ఈ శతాధిక పార్టీకి సొంతం కావడం ఖాయం.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications