మహిళలు అలా వుంటే పురుషుల దినోత్సవం జరుపుకునే రోజు వస్తుందన్న ఎంపీ కవిత
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ఎంపీ కల్వకుంట్ల కవిత పురుషులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలు కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదని, మహిళలు సంఘటితంగా ఉంటే భవిష్యత్తులో పురుషులు, తమ ప్రాధాన్యాన్ని తెలియజేసేలా పురుషుల దినోత్సవం జరుపుకునే రోజులు వస్తాయని కవిత చమత్కరించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ యూసుఫ్ గూడా లోని చిన్న, మధ్య, సూక్ష్మ తరహా ఉత్సాహిక పారిశ్రామికుల శిక్షణ కేంద్రంలో లో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన జాతీయస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశానికి ఎంపి కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

హైదరాబాద్ లో జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మహిళ తానూ, తన కుటుంబం ఉన్నత స్దాయికి ఎదగాలని కలలు కంటారు..అయితే ఈ కల సాకారం కావడంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆమె అన్నారు. వీటిని ధైర్యంగా ఎదుర్కోవాల్సింది మనమేనన్నారు. మహిళలు సంఘటితంగా ఉంటే, భవిష్యత్ లో పురుషులు పురుషుల దినోత్సవం జరుపుకునే రోజులు వస్తాయని చెప్పిన కవిత తెలంగాణలో మహిళలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications