ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్: ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న కార్తీక్(21) జులై 17న ఐఐటీ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లిన తిరిగి క్యాంపస్‌కు తిరిగి రాలేదు. విద్యార్థి స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తాండా.
కాగా, కార్తిక్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు జులై 19న క్యాంపస్‌కు వెళ్లి ఆరా తీశారు. అయితే, అక్కడ కూడా లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా కార్తీక్ విశాఖపట్నం వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. తల్లిదండ్రులను తీసుకుని అక్కడికి వెళ్లారు.

ఇది ఇలావుండగా, ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్న బన్నీ అనే 18 ఏళ్ల విద్యార్థి అదృశ్యమయ్యాడు. అతడి స్వస్థలం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి. జులై 6న తాను ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి ఔట్ పాస్ తీసుకున్నాడు.
వర్సిటీ నిబంధనల మేరకు సిబ్బంది అతడికి ఔట్‌పాస్ జారీ చేశారు. అయితే, ఇంటికి చేరుకోలేదని బన్నీ తల్లిదండ్రులు వర్సిటీ సిబ్బందికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సిబ్బంది సూచనతో విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి కోసం గాలింపు చేపట్టారు.
గచ్చబౌలి ఫ్లైఓవర్ నుంచి పడి యువకుడు మృతి
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి పడి బైక్‌పై వెళుతున్న యువకుడు మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఇద్దరు యుకులు బైక్‌పై ప్రయాణిస్తూ డివైడర్ ను ఢీకొట్టారు. దీంతో ఒకరు ఫ్లైఓవర్ పైనుంచి మరో ఫ్లైఓవర్ మీదకు పడిపోయాడు. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరి ఒకరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న మధు(25)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications