ఆకస్మిక మార్పు, భారీ వర్షాలు- ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పు కనిపిస్తోంది. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పాటుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతా ల్లో అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు ఇబ్బంది పడుతున్నాయి. అయితే, ఆకస్మికంగా వాతావరణం లో వచ్చిన మార్పులతో వర్షాలు మొదలయ్యాయి. రానున్న రెండు రోజులు వడగాల్పులతో పాటుగా భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు రాష్ట్రాల్లోనూ రానున్న రెండు రోజుల వాతావరణ పరిస్థితుల పైన అలర్ట్స్ జారీ చేసింది.
వాతావరణంలో వస్తున్న మార్పుల వేళ హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అలర్ట్స్ జారీ చేసింది. పలు ప్రాంతాలకు వర్ష సూచన చేసింది. ఈ రోజు రాత్రి నుంచి రేపు (సోమవారం) పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉందని పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈదురుగాలులతో వర్షాలు పడతాని వెల్లడించింది. దీంతో, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా.. ఆదివారం ఉదయం నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, యాదాద్రి జిల్లాలో వర్షం కురిసింది.. ఇదిలాఉంటే.. ఉత్తర తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వాడగలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు గరిష్టంగా మెదక్ లో 42.9, కనిష్టంగా హనుమకొండ లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏపీలోనూ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో ఆది వారం, సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications