మళ్లీ ముంచుకొస్తోంది, మూడు రోజులు కుండపోతే - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాల ధాటికి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాగులు పొంగాయి. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం ధాటికి పంట నష్టం జరిగింది. ఇటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో సారి భారీ వర్షాల పైన హెచ్చరిక చేసింది. రానున్న మూడు రోజులు ఏపీలోని పలు ప్రాంతాలతో పాటుగా తెలంగాణలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తాజా అలర్ట్స్ జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్సాలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని కొన్ని జిల్లాలలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

imd-forecast-heavy-rains-some-parts-of-ap-and-many-districts-in-telangana-for-next-three-days

ఏపీలోని విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ,గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, ములుగు, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+