ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ముందస్తు రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో గత నెల చివరలోనే వాతావరణం కూల్ అయింది. ఆ తరువాత రుతుపవనాల కదలిక మందగించింది. ఫలితంగా ఉక్కపోత పెరిగిపోయింది. తిరిగి ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశలనుంచి గాలులు ఫలితంగ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురిసినట్టు వెల్లడించింది. ఈ రోజు కూడా జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ జారీ చేసింది.

ఇదే సమయంలో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతుండటంతో ఈరోజు మరింతగా విస్తరించి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలోనూ రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications