ఐదు రోజులు వర్షాలు.. నేడు ఈ జిల్లాలలోనే..మేఘాల మెసేజ్!

గత కొన్ని రోజులుగా భానుడి భగభగలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు కేరళకు చేరిన నైరుతి రుతుపవనాల రాక శుభవార్త మోసుకొస్తోంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే శుభవార్త చెప్పింది. దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు జూన్ 6 నుండి జూన్ 10 వ తేదీ వరకు వర్షాల హెచ్చరిక చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక

రాష్ట్రంలోని అనేక జిల్లాలలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాతావరణ మార్పుల వల్ల రాష్ట్రంలో ఎండల తీవ్రత గణనీయంగా తగ్గనుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 2 నుండి 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

IMD predicts heavy rainfall across several districts of Telangana for five days from June 6 to 10

ఈ జిల్లాలలో భారీ వర్షాలకు ఛాన్స్

రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

కేరళను తాకిన రుతుపవనాలు

మరోవైపు, దేశంలో వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తూ నైరుతి రుతుపవనాలు జూన్ 4వ తేదీన కేరళ తీరాన్ని తాకాయి. సాధారణ సమయం కంటే నాలుగు రోజులు ఆలస్యంగా ఇవి కేరళలోకి ప్రవేశించినప్పటికీ, ప్రస్తుతం అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రుతుపవనాలు రానున్న వారం రోజుల్లో తెలంగాణాకు రానున్నాయి.

మెట్రోలో ప్రయాణం చేస్తున్నారా? ఇవి తీసుకెళ్తే జైలుకే .. రూల్స్ ఇవే!
మెట్రోలో ప్రయాణం చేస్తున్నారా? ఇవి తీసుకెళ్తే జైలుకే .. రూల్స్ ఇవే!

వారం రోజుల్లో తెలంగాణాకు రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ వర్షాల రాకతో ఎండల బారి నుంచి సామాన్య జనానికి పూర్తి ఊరట లభించనుంది. అయితే ఇంకా పంటలను విక్రయించుకోని రైతులు వర్షాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పంటలను కాపాడుకునేలా ప్లాన్ చేసుకోవాలని వాతావరణ శాఖాధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+