తెలంగాణాకు ఐఎండీ హెచ్చరిక.. మళ్ళీ వర్షాలు, జాగ్రత్త!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలోనూ ఏర్పడిన ఉపరితల ద్రోణుల ప్రభావంతో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక అండమాన్ కు పశ్చిమంగా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది .ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

నేడు వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
తెలంగాణ రాష్ట్రంలో నేడు 30 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రత ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

IMD warns Telangana Rains again yellow alert to these districts be careful

ఈ జిల్లాలలో నేడు భారీ వర్షాలకు ఛాన్స్
తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి, నాగర్కర్నూల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్, మెదక్, హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల వర్షాల వల్ల వరద ముంపుకు గురైన కొన్ని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

రైతులకు వాతావరణ శాఖ అలెర్ట్
రైతులు వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. వర్షం పడే ప్రాంతాలలో పంటలు తడిసి పోకుండా టార్పాలిన్లు కప్పుకొని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద ఉండొద్దని, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో సెల్ ఫోన్లో మాట్లాడొద్దని సూచనలు చేస్తున్నారు.

వరంగల్ కు వర్షం... స్థానికంగా ఆందోళన
ఇప్పటికే మొన్న మొంథా తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్రానికి జరిగిన తీరని నష్టం నుండి ఇంకా తెలంగాణ రాష్ట్రం బయటపడలేదు. వరద ముంపుకు గురైన వరంగల్ ఇంకా కోలుకోక ముందే మళ్ళీ వరంగల్ కు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో వరంగల్ వాసులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏంటి అని లబోదిబోమంటున్నారు.

అన్నదాతలకు కన్నీరు తెప్పిస్తున్న వర్షాలు
మరోవైపు అధికారులు నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం తాలూక సర్వేలను చేయిస్తూ నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సీజన్లో కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు అశనిపాతం గా మారాయి. వారి కంట కన్నీరు తెప్పిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+