అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కోసం.. ఇప్పుడు టీఆర్ఎస్ కోసం.. స్టార్ క్యాంపెయినర్ , నటుడు వేణు ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలలో ఖమ్మం స్థానం ఎలాగైనా ఈసారి టీఆర్ ఎస్ ఖాతాలో వేసుకోవాలని నామా నాగేశ్వరరావు ప్రచారం నిర్వహిస్తున్నారు . ఇక ఆయన కోసం పార్టీ ముఖ్యులు , మంత్రులు కూడా కష్టపడుతున్నారు. ఈసారి నామాను గెలిపించాలని టీఆర్ ఎస్ పార్టీ తరపున ప్రచారం చెయ్యటానికి రంగంలోకి దిగారు స్టార్ క్యాంపెయినర్ వేణు .

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కోసం .. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కోసం సినీనటుడు వేణు ప్రచారం
తెలంగాణా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పసుపు పచ్చ కండువా వేసుకుని సైకిల్ తొక్కుతూ టీడీపీకి ఓటెయ్యాలని ఖమ్మంలో ఓ రేంజ్ లో ప్రచారం చేసిన సినీ నటుడు వేణు ఇప్పుడు టీఆర్ ఎస్ కోసం ప్రచారం చేస్తున్నారు. ఎలక్షన్ తేదీ దగ్గరపడుతుండటంతో నామా గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ చిత్ర విచిత్రమైన జిమ్మిక్కులు చేస్తున్న వేణుని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరడుగట్టిన టీడీపీ వాదిగా ప్రచారం చేసిన ఆయన ఇప్పుడు కరడుగట్టిన టీఆర్ఎస్ వాదిగా కనిపిస్తుంటే చూసిన జనాలు విస్తుపోయారు. పార్టీల నేతలే కాదు స్టార్ క్యాంపెయినర్లు కూడా ఊసరవెల్లిలా రంగులు మారుస్తారా అని విస్మయానికి గురవుతున్నారు.

నామా టీఆర్ఎస్ లో చేరటంతో నామా నాగేశ్వరరావు కోసం ప్రచారం నిర్వహిస్తున్న వేణు
గత ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేసిన వారంతా ఇప్పటు తెలంగాణలో టిఆర్ఎస్ కు అండగా నిలుస్తూ ప్రచార సరళిని హీటెక్కిస్తున్నారు. ఫ్యాక్షన్ చిత్రాల దర్శకుడు బి.గోపాల్‌కు స్వయానా మేనల్లుడు అయిన ఫ్యామిలీ చిత్రాల హీరో వేణు గత ఎన్నికల్లో ఖమ్మంలో టీడీపీ తరుపున ,తాజా ఎన్నికల్లో సమీకరణాలు మారడం, నామా నాగేశ్వరరావు తేదేపాను వీడి తెరాస తీర్థం పుచ్చుకున్న పరిస్థితుల్లో వేణు తను కూడా పార్టీ మారి టీఆర్ఎస్ కండువా కప్పుకుని నామా తరుపున ఇంటింటి ప్రచారం మొదలుపెట్టడం ఆసక్తికరంగా మారింది.

హోటల్ లో బజ్జీలు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే యత్నం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో నామా తరుపున ప్రచారంలో పాల్గొన్న వేణు ఓ హోటల్‌లో బజ్జీలు వేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ఎన్నికల్లో నామా గెలుపు ఖాయంగా కనిపిస్తోందని వేణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా నేతలే కాదు క్యాంపెయినర్లు రోజుకో పార్టీ మారుతున్న చిత్రాలు, విచిత్రాలు ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications