కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగల హల్చల్.. ప్రధాన ఆలయంలో విగ్రహాలు చోరీ
జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు విగ్రహాలను, బంగారు ఆభరణాలను, వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లారు.
ఒక పక్క తెలంగాణ సీఎం కేసీఆర్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన హనుమాన్ ఆలయంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తుంటే, కొండగట్టు ఆలయ అభివృద్ధికి వందకోట్లు విడుదల చేసి చక్కని మాస్టర్ ప్లాన్ తో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా కేసీఆర్ కొండగట్టుకు వెళ్లి మహా మహిమాన్వితమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వచ్చారు. కొండగట్టును యాదాద్రి తరహాలో అభివృద్ధి చెయ్యాలని సంకల్పించారు. దీంతో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ సమయంలో అంజన్న ఆలయంలో దోపిడీ దొంగలు రెచ్చిపోవడం అందరినీ ఒక్కసారి షాక్ కు గురిచేస్తుంది .

కొండగట్టు హనుమాన్ ఆలయంలో చోరీ
కొండగట్టు ఆలయంలో ఊహించిన సంఘటన జరిగింది. కొండగట్టు ఆలయంలో నేడు చోరీ జరిగింది. దోపిడి దొంగలు స్వామివారి ఆలయంలో రెండు విగ్రహాలను అపహరించుకుని వెళ్లారు. మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో దొంగలు రెచ్చిపోయారు. నిన్న అర్ధరాత్రి స్వామి వారి పవళింపు సేవ ముగిసిన తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు ప్రధాన ద్వారానికి తాళాలు వేసి వెళ్ళిపోయారు.

బంగారు, వెండి ఆభరణాలతో పాటు విగ్రహాలు చోరీ
తిరిగి ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ నిర్వహించేందుకు వెళ్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుండి దొంగలు చొరబడినట్టు గుర్తించారు . ప్రధాన ఆలయంలో బంగారు నగలతో పాటు కొన్ని విగ్రహాలను చోరీ చేసినట్టు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు ప్రధాన ఆలయం తాళాలు పగలగొట్టి రెండు విగ్రహాలను ఎత్తుకెళ్లారు. స్వామి వారి వెండి మకర తోరణం తో పాటు, బంగారు ఆభరణాలను పలు వెండి వస్తువులను అపరించుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది.

సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు .. ఆలయంలో ఆధారాల సేకరణ
ప్రస్తుతం దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణను ప్రారంభించారు. ఆలయంలోకి భక్తులతో పాటు ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు. ఆలయంలో ఆధారాలను సేకరిస్తున్నారు. కొండగట్టు ఆలయం ఎప్పుడూ భక్తుల సందడితో ఉంటుంది. అటువంటి ఆలయంలో దొంగలు చోరీ ఎలా చేశారు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications