శ్రీనివాసుడి ఆవతామెత్తిన దొంగ బాబా.. పోలీసుల రంగ ప్రవేశంతో మారిన సీన్..
కొంత మంది ప్రజలను మోసాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బులు కాజేస్తుంటారు. కొందరైతే బాబాల అవతామెత్తి మహిళలను లైంగికంగా వేధిస్తుంటారు. తాజాగా పాలమూరులో ఓ వ్యక్తి తాను మానవ రూపంలో ఉన్న శ్రీవిష్ణువు అని ప్రచారం చేసుకున్నాడు. తన చుట్టూ తిరిగితే అంతా మంచి జరుగుతుందని చెప్పుకున్నాడు. తానే దేవుడినని.. అవతారపురుషుడని ప్రచారం చేసుకున్నాడు.
అతని డైలాగ్ లు సోషల్ మీడియాలో వైరల్ దీంతో ప్రజలు అతని వద్దకు భారీగా తరలి వచ్చారు. అతని వద్దకు క్యూ కట్టారు. తమిళనాడుకు చెందిన రంగనాథం అనే వ్యక్తి శ్రీనివాసుని అవతారమెత్తాడు. తాను దేవుడి ఆవతారమని కేటీదొడ్డి మండలం కొండాపురం స్టేజ్ వద్ద ఓ గుడారం ఏర్పాటు చేసుకున్నాడు. శ్రీనివాసుడి ఆవతారంలో శేషతల్పం నిద్రించాడు. అతనికి ఇద్దరు భార్యలు సేవ చేస్తూ కనిపించారు. అతడిని చూసి ప్రజలు దేవుడనుకుని భారీగా తరలివచ్చారు.

భక్తులు భారీగా రావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని మరో ప్రాంతానికి తరలించాలు. అతడి గురించి పోలీసులు వాకాబు చేయగా.. అతనో చీటర్ అని తేలింది. ఇతడికి పోలీసులు గతంలోనే కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. దీంతో రంగనాథం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ప్రజలు దొంగ బాబాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
గతంలో చాలా మంది దొంగ బాబాలు ప్రజలను మోసం చేశారు. అందుకే ప్రజలు మూఢనమ్మకాలతో ఎవరిని పడితే వారిని నమ్మొద్దని పోలీసులు కోరుతున్నారు. మోసపోయేవారుంటే.. మోసం చేసే వారు ఉంటారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications