KCR: ప్రణీత్ రావు చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు.. కేసీఆర్ ను కూడా విచారిస్తారా..!
సస్పెన్షన్ లో ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రణీత్ రావు స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో(SIB)లో పని చేశారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టుల ఫోన్ ను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పోలీసు అధికారుల విచారణలో తేలింది. దీంతో ప్రణీత్ రావు సస్పెండ్ చేశారు.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలియగానే ప్రణీత్ రావు స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో వెళ్లినట్లు గుర్తించాుర.ఎస్‌వోటీ లాగర్ రూమ్‌లో ప్రణీత్‌రావు విధ్వంసం సృష్టించినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. ప్రణీత్ రావు స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరోలో ఆపరేషన్ డిపార్ట్ మెంట్ కు హెడ్ గా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే.. అదే రోజు రాత్రి ఎస్ఐబీ ఆఫీస్ కు వెళ్లినట్లు గుర్తించారు.

అతను రాత్రి 9 గంటలకు ఎలక్ట్రిషియన్ సహాయంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేయించాడు. తర్వాత లాగర్ రూమ్ లోకి వెళ్లాడు. అక్కడు 45 హార్డ్ డిస్కలను ధ్వంసం చేశాడు. వాటి స్థానంలో కొత్త హార్ట్ డిస్కులు పెట్టాడు. దాదాపు 16 వందలకు పైగా డాక్యుమెంట్లను సెలర్ లోకి తీసుకొచ్చి కాల్చేశాడు. ఎంఈఐ నెంబర్లను ధ్వంసం చేసినట్లు పోలీస్ విచాణలో తేలింది. ప్రణీత్ రావు అనధికారికంగా రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు.
అందుకే అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావు బంధువు అవుతాడు. అందుకే అతన్ని ఎస్ఐబీలో అపాయింట్ చేసినట్లు తెలిసింది. కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రణీత్ రావు ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్ ట్యాప్ చేసి ఆ ఫోన్ సంభాషణకు కేసీఆర్ కు వినిపించే వారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ కేసులో బలమైన ఆధారులు ఉంటే కేసీఆర్ ను కూడా విచారించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications