దసరా వేళ మెరుపు దాడులు.. 4 పాల పిట్టలను కాపాడిన పోలీసులు

పాల పిట్టను తెలంగాణ రాష్ట్ర పక్షిగా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ పక్షి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఈ పక్షిని నిర్బంధించడం, రవాణా లేదా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే హైదరాబాద్‌ లో దసరా సందర్భంగా ఇనుప బోనుల్లో బంధించిన 4 పాల పిట్టలను పోలీసులు మెరుపు దాడలు చేసి వాటిని కాపాడారు. వాటిని ప్రాణాలతో కాపాడి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. పండగ పేరుతో మూగ ప్రాణుల స్వేచ్ఛను హరిస్తూ, స్వార్థం కోసం చిత్రహింసలకు గురిచేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక ఇదే విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రస్తావించారు.

ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాల్సిన తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను దసరా వేళ కొందరు స్వార్థం కోసం ఇనుప బోనుల్లో బంధించారు.. మూగజీవులను హింసిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని మేం ముందుగానే స్పష్టంగా హెచ్చరించినప్పటికీ.. కొందరు పెడచెవిన పెట్టి ఆ నిస్సహాయ పక్షులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. అప్రమత్తమైన పౌరుల నుంచి అందిన పక్కా సమాచారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు తక్షణమే స్పందించి, మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిపి మొత్తం 4 పాల పిట్టలను ప్రాణాలతో కాపాడారని వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.

లంగర్‌ హౌస్ బాపు ఘాట్ సమీపంలోని ఆలయం వద్ద ఇరుకైన బోనుల్లో నరకయాతన అనుభవిస్తున్న రెండు పాల పిట్టలను విడిపించి కేబీఆర్ పార్క్ అటవీ అధికారులకు అప్పగించగా.. ఛత్రినాక శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం వద్ద చెట్టుకు బోను వేలాడదీసి నిర్బంధించిన ఒక పాల పిట్టను, అలాగే మంగళహాట్ బాలాజీనగర్ గుడి సమీపంలో బోనులో ఉంచిన మరో పాలపిట్టను రెస్క్యూ చేసి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. బాధ్యులపై అటవీశాఖ సమన్వయంతో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

IndianRollers Lightning operations during Dasara Police rescue 4 Indian Rollers Dasara latest news

పండుగ పేరుతో ఒక నిస్సహాయ పక్షిని బంధించి, ఆహార నీళ్లు లేకుండా చిత్రహింసలకు గురిచేసి చూడటం ఎవరికీ మంచి చేయదు.. ఇది మన సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రాణభయంతో బోను చువ్వల మధ్య విలవిల్లాడుతున్న పక్షి రోదనలో శుభం ఎలా కనిపిస్తుంది..? నిజమైన భక్తి అంటే జీవ కారుణ్యమే తప్ప, ప్రకృతిని బందీ చేయడం కాదు. మూగ ప్రాణుల స్వేచ్ఛను హరిస్తూ, కాసుల వేటకు తెరలేపే ఇలాంటి అమానవీయ పోకడలను ఎవరూ ప్రోత్సహించవద్దు. వన్యప్రాణులకు హాని తలపెట్టే ఘటనలు ఎక్కడ కనిపించినా వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112 కు సమాచారం అందించి బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని కోరుతున్నామని సజ్జనార్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+