హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేశారా? మీకో గుడ్ న్యూస్!

తెలంగాణాలోని ఇళ్ళు లేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చెయ్యాలని సంకల్పించింది తెలంగాణా ప్రభుత్వం.అందుకే వారి కల నిజం చేయటం కోసం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించింది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునేవారికి 5 లక్షల రూపాయలు విడతల వారీగా ఇస్తోంది. ఇక సొంత ఇంటి స్థలం లేని వారికి కూడా ఇందిరమ్మ హౌజింగ్ అపార్ట్మెంట్స్ నిర్న్మించి ఫ్లాట్స్ ఇస్తోంది.

హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి అర్హత వీరికే

ఇక గ్రేటర్ హైదరాబాద్ వాసులకు సొంతింటి కల నెరవేర్చుకునే అవకాశం కల్పించింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తాజాగా ప్రభుత్వం శుభవార్త అందించింది. హౌసింగ్ బోర్డు లాటరీకి అర్హత సాధించినవారి వివరాలను విడుదల చేసింది. మొత్తం 16 నియోజకవర్గాల నుంచి 60,720 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలన తర్వాత అనర్హులుగా గుర్తించినవారికి నోటీసులు పంపారు.

Indiramma houses lottery govt releases eligible beneficiaries list for lottery in Hyderabad CUREarea

అభ్యంతరాలను పరిశీలిస్తున్న హౌసింగ్ బోర్డు అధికారులు

వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి పరిశీలన కొనసాగుతోంది. నగరంలో స్థిర నివాసం లేనివారు, ఇప్పటికే ఇల్లు లేదా ఫ్లాట్ ఉన్నవారు, వ్యక్తిగత అవసరాలకు ఫోర్ వీలర్ ఉపయోగిస్తున్నవారిని అనర్హులుగా పరిగణించారు. క్యాబ్ సర్వీసుల కోసం వాహనం ఉపయోగించేవారికి అయితే అర్హత ఉందని నిర్ధారించారు.

లాటరీలో ఎవరి పేరు వస్తే వారికి ఇందిరమ్మ ఇల్లు

అర్హులైనవారికి ఆగస్టు 27 నుంచి 30వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా లాటరీ ద్వారా ఇళ్లు కేటాయించనున్నారు. లాటరీలో ఎవరి పేరు వస్తే వారికి ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తారు. అయితే ఇందులో లబ్ధిదారులు తమ పేరు ఉందో లేదో ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్‌తో http://ts.meeseva.telangana.gov.in, http://tghb.cgg.gov.in, http://tghb.telangana.gov.in వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు.

కొండా సురేఖపై రేవంత్ మౌనం.. చర్యల జాప్యం వెనుక బిగ్ రీజన్స్!
కొండా సురేఖపై రేవంత్ మౌనం.. చర్యల జాప్యం వెనుక బిగ్ రీజన్స్!

అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్లు

క్యూర్ పరిధిలో ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నవారికి ఇళ్ళ కేటాయింపు ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వీపీ గౌతం అన్నారు.. అనర్హుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నాం. అర్హత ఉంటే జాబితాలో చేరుస్తాం అన్నారు. ఈ ఏర్పాటుతో అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్లు అందే అవకాశం ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+