హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు అలర్ట్... అక్టోబర్ 9లోగా రూ.1లక్ష చెల్లించకుంటే జరిగేదిదే!

హైదరాబాద్ మహానగరంలో పేద కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేసే ఇందిరమ్మ టవర్స్ పథకం లబ్ధిదారులకు ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. క్యూర్ పరిధిలో తాత్కాలిక కేటాయింపు పత్రాలు అందుకున్నవారు అక్టోబర్ 9వ తేదీలోగా మొదటి వాయిదాగా రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంది. లేనిపక్షంలో ప్రొవిజనల్ అలాట్‌మెంట్ రద్దు కావచ్చని తెలంగాణ హౌసింగ్ బోర్డు హెచ్చరించింది.

తొలి దశలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఫ్లాట్లు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి, అర్హత తనిఖీలు పూర్తి చేసిన తర్వాత 5,501 కుటుంబాలకు తాత్కాలిక కేటాయింపు పత్రాలు జారీ చేశారు. ఇప్పటికి 3,271 మంది సుమారు 59.46 శాతం మాత్రమే రూ.1 లక్ష చెల్లించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో చెల్లింపు శాతం 81 శాతానికి పైగా ఉండగా, కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంది.

Indiramma Towers Hyderabad Beneficiaries Must Pay Rs 1 Lakh by October 9 or Lose Provisional Allotment

ప్రతి ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 528 చదరపు అడుగులు, కార్పెట్ ఏరియా 480 చదరపు అడుగులు ఉంటుంది. నిర్మాణ వ్యయం దాదాపు రూ.11 లక్షలు అయినా ప్రభుత్వం రూ.5 లక్షలు సబ్సిడీగా ఇస్తుంది. లబ్ధిదారులు మిగిలిన రూ.6 లక్షలు విడతల వారీగా చెల్లించాలి. భూమి ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ఫ్లాట్‌తో పాటు భూమిలో అవిభాజ్య వాటా కూడా లబ్ధిదారులకు ఉంటుంది.

నిర్మాణం ఒక సంవత్సరంలో పూర్తి చేసి తాళం చెవులు అందజేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే చెప్పారు. హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ అందరినీ అక్టోబర్ 9 గడువును దాటకుండా చెల్లించాలని కోరారు. ఇక ఆ తర్వాత గడువు పొడిగింపు లేదని స్పష్టం చేశారు.

చెల్లింపు చేయని వారి ఫ్లాట్లను వెయిటింగ్ లిస్టులో ఉన్న అర్హులైన దరఖాస్తుదారులకు కేటాయిస్తారు. ప్రస్తుతం సుమారు 35 వేల మంది అర్హులైన దరఖాస్తుదారులు ఉన్నారు. వారికి రాబోయే లాటరీలో అవకాశం ఇవ్వనున్నారు. చెల్లింపు చేయాలంటే అలాట్‌మెంట్ లెటర్‌లోని వర్చువల్ అకౌంట్ నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో చేయవచ్చు. వివరాల కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్ https://tghb.telangana.gov.in/ సందర్శించవచ్చు లేదా కాల్ సెంటర్ 040-24603572ను సంప్రదించవచ్చు.

సన్నబియ్యం ధరలు పైపైకి: ఎల్ నినో కష్టాలు షురూ!
సన్నబియ్యం ధరలు పైపైకి: ఎల్ నినో కష్టాలు షురూ!

ఈ పథకం హైదరాబాద్‌లో ఒక లక్ష ఫ్లాట్లు నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. నగరం మధ్యలోనే పేదలకు సొంతింటి అవకాశం కల్పించడం దీని ప్రత్యేకత. లబ్ధిదారులు గడువు లోపు చెల్లింపు పూర్తి చేసుకుని తమ కేటాయింపును కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+