ఇంద్రవెల్లి-జలియన్ వాలాబాగ్ హింసకు పెద్ద తేడా లేదు.!అమరులకు నివాళులు అర్పించిన షర్మిల.!
ఇంద్రవెల్లి/హైదరాబాద్ : దాదాపు 42సంవత్సరాల క్రితం ఇంద్రవెల్లిలో జరిగిన దారుణ మారణ కాండకు, జలియన్ వాలాబాగ్ దురాగతానికి పెద్ద తేడా లేదని వైయస్సాటీపి అధినేత్రి వైయస్ షర్మిళ పేర్కొన్నారు. రెండు సంఘటనల్లో కరుడు గట్టిన క్రూరత్వం రక్తపుటేరులు ప్రవహింపజేసిందని ఆవేదన వ్యక్తం చేసారు షర్మిళ. హింసను ప్రేరేపించి, బడుగు బలహీనవర్గాల, నిరుపేదల బ్రతుకులను రక్తసిక్తం చేసిన దురహంకారుల చరిత్ర మట్టిలో కలిసిపోయింది తప్ప చరిత్రలో మిగిలిసోలేదన్నారు షర్మిళ. ఇంద్రవల్లిలో సొంత భూములకోసం పోరాడి అసువులు బాసిన నిరుపేద అమరుల స్తూపానికి షర్మిళ నివాళి అర్పించి భావోద్వేగానికి గురయ్యారు.
ఇంద్రవెల్లి దారునమారణ కాండ హృదయవిదారకరం..
నలభై రెండు సంవత్సరాల క్రితం ఇదే ఇంద్రవెల్లిలో అడవి బిడ్డలు వాళ్ల భూమి మీద హక్కుల కోసం కొట్లాడినందుకు వాళ్ల మీద కర్కషంగా బుల్లెట్ల వర్షం కురిపించారని షర్మిళ ఆవేదన వ్యక్తం చేసారు. కొన్నేళ్ల క్రితం ఇదే రోజు ఇంద్రవెల్లిలో అమరులైన ఎంతో మంది అమాయకులకు, అభాగ్యులకు నివాళులు అర్పించడానికి ఇంద్రవెల్లి రావడం జరగిందన్నారు షర్మిళ. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన వారికి, ఈ వీరులకు సలాం అని, వారి పోరాటానికి,ఆ పోరాటం జరిగిన ఇంద్రవెల్లి గడ్డకు లాల్ సలాం అన్నారు షర్మిళ. ఒకప్పుడు జలియన్ వాలాబాగ్ దుర్గటనలో తెల్లదొరలకు బలయిపోతే, ఆ తర్వాత స్వతంత్ర్య భారతదేశంలో ఇంద్రవెల్లిలో ఎంతోమంది ఇక్కడ ఆదివాసీలు బలైపోయారని, రెండు ఉదంతాలకు పెద్ద తేడా లేదన్నారు షర్మిళ.

భూ హక్కులకోసం పోరాడితే చంపుతారా.?
తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఎంతమందిని చిత్రహింసలకు గురిచేశారో తెలియంది కాదని, చంద్రశేఖర్ రావు భూమి లేని గిరిజనులకు భూమి ఇవ్వకపోగా మాటిచ్చి తప్పి కూడా ఇప్పుడు అసెంబ్లీలో నిల్చొని అడవి బిడ్డలు దొంగలైనట్లు భూమి కబ్జా చేసుకుంటున్నారన్నట్లు, అసలు వాళ్లకు అడవి భూములపై హక్కుల లేవన్నట్లు, దయతలచి ప్రభుత్వం ఇస్తేనే తీసుకోవాలన్నట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు ఆ భూములు కబ్జా చేయము అని ఒక అఫిడవిట్ అడుగుతున్నారంటే అసలు చంద్రశేఖర్ రావును ఏమనుకోవాలని షర్మిళ ప్రశ్నించారు. సీఎం చంద్రశేఖర్ రావు అడవి బిడ్డల కోసం ఏం చేశారని షర్మిళ సూటిగా ప్రశ్నించారు.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో హక్కులు కోల్పోతున్న గిరిజనులు
రాష్ట్రంలో ఎస్టీ సామాజిక వర్గం అట్టడుగున ఉందని, ఉండటానికి ఇళ్లు లేక, బాత్రూం సౌకర్యం లేక, ఎంతోమందికి కనీసం విద్యుత్ సౌకర్యం లేక, పిల్లలకు సరైన చదువులు లేక ఇబ్బంది పడుతున్నారని షర్మిళ ఆందోళన వ్యక్తం చేసారు. గిరిజనులు, ఎస్టీల చదువుల కోసం, ఉపాధి కోసం, సంక్షేమం కోసం చంద్రశేఖర్ రావు ఏం చేసారని నిలదీసారు. చంద్రశేఖర్ రావు కు ఎస్టీలంటే ప్రేమ ఉందంటే ఎలా నమ్మడమని, ఆయన హయాంలో ఒక్క స్కీం అయినా సక్రమంగా నడుస్తుందా? సీఎం ఎస్టీ ఆంట్రపొనీర్ స్కీం అన్నారు.. ఎంతమందిని ఆంట్రపొనీర్ చేశారని షర్మిళ ప్రశ్నించారు. కార్పొరేషన్లలో లోన్ల కోసం లక్షల మంది దరఖాస్తులు పెట్టుకుంటే ఒక్కరికైనా స్వయం ఉపాధి కల్పించడానికి రుణం ఇచ్చారా అని నిలదీసారు షర్మిళ.

కనీస మౌళిక సదుపాయాలు మృగ్యం..
సీఎం చంద్రశేఖర్ రావు పది శాతం ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తానని వారిని మోసం చేసారదని, ఇప్పుడు గిరిజన బంధు అని మళ్లీ మోసం చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారని అన్నారు. ఇది ఎన్నికల వాగ్ధానం కాకపోతే ఏంటని సీఎంను ప్రశ్నించారు షర్మిళ. రాష్ట్రంలో గిరిజనుల కోసం కొట్లాడిన ఏకైక పార్టీ వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అని, రాజశేఖర్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారని, 6 లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అనుకున్నారని షర్మిళ గుర్తు చేసారు. ఎస్టీలకు, గిరిజనులు, అడవి బిడ్డలకు నాణ్యమైన విద్య లేదని, ఇండ్లు కూడా లేవని, ఉద్యోగాలు అసలే లేవని, కనీసం కరెంటు, బాత్రూంలు లేకుండా ఎంతోమంది కాలం వెళ్ల దీస్తున్నారని, అందరికీ వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అండగా నిలబడుతుందని షర్మిళ భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications