వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినూత్నంగా కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ.!మంత్రికి నీరాజనం పలికిన మహిళలు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పేదల ఇండ్లలో జరుగుతున్న పెండ్లిళ్లకు ఆడపడుచు కట్నంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించిన /షాదిముబారక్ చెక్ లు నేరుగా తమ చెంతకే చేరుతుండడంతో నారి లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇంటింటికీ కాలి నడకన బయలు దేరిన అభిమాన నేతకు ఆయా వార్డుల ప్రజలు ముఖ్యంగా మహిళలు హారతులతో బ్రహ్మరథం పట్టడం గురువారం రోజున సూర్యపేట పురపాలక సంఘం పరిధిలో విశేషంగా జనాలను ఆకర్షించింది. సూర్యపేట పురపాలక సంఘం పరిధిలోని 13 వార్డులలోనీ 86 మందికి కళ్యాణాలక్ష్మి/షాదిముబారక్ పధకం కింద మొత్తం 86 లక్షల 1,376 రూపాయలను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అందజేసారు. లబ్ధిదారులకు ఆ మొత్తం చెక్కులను మంత్రి అందజేసారు.

Innovative Kalyana Lakshmi check distribution.!

కాగా పేదింట్లో జరిగే పెళ్లిళ్లకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించిన కట్నాన్ని గతానికి భిన్నంగా లబ్ధిదారుల ఇండ్లకే వెళ్లి అందించాలని మంత్రి జగదీష్ రెడ్డి సంకల్పించారు. సంకల్పానికి అనుగుణంగా ఉండాలని కాలి నడకన ఆయా కాలనిలలో కలియ తిరుగుతూ, పట్టణ వాసులను పేరు పేరు నా పలకరిస్తూ ఇంటికే చేరి చెక్ లను అందజేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డికి హారతిలిస్తూ నారిలోకం బ్రహ్మరథం పట్టింది. లబ్ది దారుల ఇంటికి స్వయంగా చేరుకున్న మంత్రి జగదీష్ రెడ్డి తో ఫోటోలు దిగేందుకు కుటుంబ సభ్యులు పోటీపడ్డారు. నియోజకవర్గంలోని అనేక వార్డులతో పాటు 38, 39,40 వార్డులలో జరిగిన ఈ వినూత్న కార్యక్రమంలో
మంత్రి జగదీష్ రెడ్డి లబ్ధిదారులకు చెక్ లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి జగదీష్ రెడ్డికి స్దానిక మహిలు నీరాజనాలు పట్టారు.

English summary
State Power Minister Guntakandla Jagadish Reddy handed over a total of Rs 86 lakh 1,376 under the Kalyana Lakshmi / Shadimubarak scheme to 86 people in 13 wards under Suryapeta municipality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X