ముకేష్ అంబానీ ఫ్యామిలీతో గౌరవం పొందిన వేణుస్వామి భార్యకు ఘోరఅవమానం!
నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్ధం తర్వాత వారి ఇద్దరి వైవాహిక జీవితంపై జ్యోతిష్య విశ్లేషణ పేరుతో షాకింగ్ వ్యాఖ్యలు చేసిన వేణుస్వామిపై చెప్పినట్టే తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదు చేశాయి. ఇక ఈ వ్యవహారంపైన ఇటీవల ముఖేష్ అంబానీ కుటుంబంతో భారీగా గౌరవాన్ని పొంది అక్కడ తన వీణావాదన పర్ఫామెన్స్ ఇచ్చిన వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి రియాక్ట్ అయ్యారు.
షాకింగ్ వీడియో చేసిన వేణు స్వామి భార్య
తాను కూడా ఒక జర్నలిస్ట్ అంటూ పేర్కొన్న ఆమె మీడియా ఛానల్స్ ను ఏకీపారేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. సెలబ్రిటీలు కలిసి ఉంటారా.. విడిపోతారా అని జ్యోతిష్యం చెప్పే తన భర్త కన్నా, సెలబ్రిటీల జీవితంలోకి తొంగి చూసి మీడియా ఛానల్స్ ను ముందు ప్రశ్నించాలని ఆమె అన్నారు. తనకు మంచు విష్ణు కాల్ చేసి అదే విషయం అడిగారని పేర్కొన్నారు.

మీడియాపైన, జర్నలిస్టులపైన మండిపడిన వీణా శ్రీవాణి
వేణు స్వామిని కాకుండా ఒక రివ్యూ తో సినిమాలపై పెట్టుకున్న ఆశల్ని చంపేస్తున్న జర్నలిస్టులను ప్రశ్నించాలని వీణ శ్రీవాణి డిమాండ్ చేశారు. తప్పుడు రివ్యూ రాసి సినిమాలు హిట్ కాకుండా చేస్తున్న జర్నలిస్టులను మీడియాని మంచు విష్ణు ప్రశ్నించాలని వేణు స్వామి భార్య డిమాండ్ చేశారు. ఇక వేణు స్వామి భార్య చేసిన వ్యాఖ్యలతో ఆమె పైన నెటిజెన్లు మండిపడుతున్నారు.
భగ్గుమన్న నెటిజన్లు.. నీ మొగుడ్ని కరెక్ట్ గా పెట్టుకో అంటూ హితవు
శుభం పలకరా సన్నాసి అంటే పెళ్లికూతురు విధవ అన్నట్టు శుభమా అంటూ నిశ్చితార్థం చేసుకుంటే విడిపోతారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ వీణా శ్రీవాణిని ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ నీ మొగుడిని కరెక్ట్ గా పెట్టుకో తర్వాత లోకానికి నీతులు చెబుదువు గాని అంటూ నెటిజెన్లు మండిపడుతున్నారు. ఇంకొకరి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం తప్పని ఎప్పుడైనా నీ మొగుడికి చెప్పావా అంటూ నిప్పులు చెరుగుతున్నారు.
వేణు స్వామీ కారణంగా జనాలతో ఘోర అవమానం
మంచు విష్ణు చేసిన కాల్ కే మీకు మండితే మీ హస్బెండ్ చేసిన చెత్త వాగుడికి వాళ్లకు ఎంత మండాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. భర్తను వెనకేసుకు రాబోయి వీణ శ్రీవాణి అనవసరంగా నెటిజన్స్ తో తిట్లు తింటున్నారు. తెలుగు రాష్ట్రం నుంచి మొన్ననే ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో అరుదైన గౌరవాన్ని పొందిన వీణ శ్రీవాణి ఇప్పుడు వేణు స్వామి కారణంగా జనాలతో ఘోర అవమానాలను ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications