Intermediate: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఆ తేదీల్లో మార్పు..
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పు చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఇంతకు ముందు మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మే 27న ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉంది.
దీంతో పరీక్ష తేదీల్లో మార్పు చేశారు. అడ్వాన్స్ సప్లమెంటరీలో పరీక్షలు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులకు ఒకే రోజు నిర్వహించనున్నారు. ఉదయం మొదటి సంవత్సరం విద్యార్థలకు మధ్యాహ్నం రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ వారికి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయిర్ వారికి మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

సప్లిమెంటరీ, ఇంప్రూమెంట్ రాసే విద్యార్థులు మే 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 24న ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ లో గతం కంటే ఉత్తీర్ణత శాతం తగ్గింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో రంగారెడ్డి జిల్ల తొలి స్థానంలో నిలిచింది.
సెకండ్ ఇయర్ ఫలితాల్లో మలుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 30 పదో తరగతి ఫలితాలు ప్రకటించనున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications