వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2 సెట్లు కనిపించకున్నా ఫర్లేదు : పరీక్ష తేదీల్లో మార్పులేదు, ఎలా నిర్వహిస్తామంటే ?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వరంగల్‌లో ఇంటర్ కొశ్చన్ పేపర్ మాయమవడంతో విద్యార్థులు ఆందోళన చెందొద్దని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని తేల్చిచెప్పింది. ప్రశ్నపత్రాలు మాయమైన ఘటనపై విచారణ జరుగతుందని .. బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టంచేసింది.

కొశ్చన్ పేపర్స్ మిస్ ..

కొశ్చన్ పేపర్స్ మిస్ ..

షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయా సెంటర్లకు ప్రశ్నప్రత్రాలు తరలించారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్ కు కొశ్చన్ పేపర్స్ వచ్చాయి. తర్వాత ఇంటర్ బోర్డు కస్టోడియన్ తనిఖీలు చేపట్టగా రెండు బాక్సులు కనిపించలేదు. దీంతో ఉన్నతాధికారులకు ఘటన గురించి చెప్పడంతో విషయం వెలుగుచూసింది. కొశ్చన్ పేపర్స్ ఏమయ్యాయనే ఆందోళన అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఇంటర్ బోర్డు స్పందించింది.

మరో సెట్లు ..

మరో సెట్లు ..

వరంగల్‌లో మయమైన కొశ్చన్ పేపర్స్ సెట్లపై క్లారిటీ ఉందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. వాటికి బదులు మరో రెండు సెట్లను రాష్ట్రవ్యాప్తంగా జరిగే పరీక్ష కేంద్రాలకు పంపిస్తామని తెలిపారు. దీంతో పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉందడదని .. యథావిధిగా జరుగుతాయని స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు సెట్లను పంపించడంతో .. పేపర్ లీకేజీకి ఆస్కారం ఉండదని బోర్డు భావిస్తోంది. అయినప్పటికీ పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.

విద్యార్థుల బలి ..

విద్యార్థుల బలి ..

గ్లోబరినా సంస్థ తప్పిదంతో 3 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారని ప్రకటించి పప్పులో కాలేసింది ఇంటర్ బోర్డు. దీంతో బోర్డు, ప్రభుత్వ విశ్వసనీయపై ప్రశ్న తలెత్తింది. తర్వాత కమిటీ వేసి .. గ్లోబరినా సంస్థదే తప్పని తేల్చింది. రీ వాల్యుయేషన్ కూడా గ్లోబరినాతోపాటు సమాంతరంగా మరో సంస్థకు కూడా అప్పగించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తప్పులు దొర్లడంతో బోర్డుపై స్టూడెంట్స్, పేరెంట్స్ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో సప్లిమెంటరీ పరీక్ష తేదీ వాయిదాపడుతూ వస్తోంది. ఈ నెల 7 నిర్వహించబోయే ఎగ్జామ్‌కు ముందు పరీక్ష పత్రాల గల్లంతు ఆందోళన కలిగించింది. అయితే వాటికి బదులు మరో రెండు సెట్లను పంపిస్తామని దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఇంటర్ బోర్డు. మరో రెండురోజుల్లో పరీక్షలు ఉన్నందున బోర్డు చెప్పే అంశానికి విద్యార్థులు, పేరెంట్స్ విశ్వసించడం లేదు. పరీక్ష ఫలితాల నుంచి తప్పులు దొర్లుతున్నందున ... 7 తేదీ నుంచి సవ్యంగా పరీక్షలు జరిగితే తప్ప బోర్డు చెప్పే అంశాలకు నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది.

English summary
Inter board said students were not worried because the question paper in the Warangal disappeared. Supplementary tests are scheduled to be done according to schedule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X