ఇంట్రెస్టింగ్.. 52 కేసులతో టాప్ పొజిషన్ లో ఆ నేత .. ఎవరిపై ఎన్ని కేసులంటే

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల ఆస్తులు, అలాగే వారిపై ఉన్న కేసులు రాష్ట్ర ప్రజలకు ఆసక్తిని కల్గిస్తున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్రిమినల్, సివిల్ కేసులు ఉండటం సహజమే అయినప్పటికీ ఎవరిపై ఎన్ని కేసులున్నాయి అనే విషయంపై చర్చ జరుగుతుంది.

కేసుల్లో టాప్ బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు

కేసుల్లో టాప్ బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో 20 మందిపై కేసులున్నాయి. అభ్యర్థులు తెలంగాణ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ల ప్రకారం కేసుల వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
వీరిలో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తోన్న సోయం బాపూరావుపై అత్యధికంగా 52 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆయన కేసులు ఎక్కువగా ఉన్న అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రంలో టాప్ పొజిషన్లో ఉన్నాడు.

కేసుల్లో రెండో స్థానంలో రేవంత్ రెడ్డి .. ఇతర అభ్యర్థుల కేసుల వివరాలు

కేసుల్లో రెండో స్థానంలో రేవంత్ రెడ్డి .. ఇతర అభ్యర్థుల కేసుల వివరాలు

ఇక రెండో స్థానంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఉన్నారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతోన్న రేవంత్‌రెడ్డిపై 42 కేసులు ఉన్నాయి. ఇక భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై 14 కేసులున్నాయి. అదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న వెంకట శ్యామ్ సుందర్‌రావుపై 7 కేసులు నమోదయ్యాయి.ఇక హైదరాబాద్ నుండి పోటీ చేసే బిజెపి అభ్యర్థి భగవంత రావు పవార్ పై మూడు కేసులు, నల్లగొండ నుండి బరిలోకి దిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై నాలుగు కేసులు , హైదరాబాద్ నుండి మజ్లిస్ పార్టీ నుండి బరిలోకి దిగుతున్న అసదుద్దీన్ ఒవైసీ పై ఐదు కేసులు, మహబూబ్ నగర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న వంశీ చంద్ రెడ్డి పై నాలుగు కేసులు , నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి పై మూడు కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది.

తలసాని సాయి కిరణ్ పై ఆరు కేసులు.. కల్వకుంట్ల కవితపై ఒక కేసు

తలసాని సాయి కిరణ్ పై ఆరు కేసులు.. కల్వకుంట్ల కవితపై ఒక కేసు


అలాగే టిఆర్ఎస్ పార్టీ నుండి సికింద్రాబాద్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తలసాని సాయి కిరణ్ పై ఆరు కేసులు, ఖమ్మం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నామా నాగేశ్వరరావు పై ఐదు కేసులు, ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రమేష్ రాథోడ్ పై మూడు కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది.

కేవలం ఒక్క కేసు మాత్రమే ఉన్నట్టుగా అఫిడవిట్లో పేర్కొన్న అభ్యర్థుల జాబితా చూస్తే
బిజెపి నుండి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్, నిజామాబాద్ అభ్యర్థి అరవింద్, మల్కాజ్గిరి అభ్యర్ది రామచంద్రరావు లపై ఒకటే కేసు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి ఖమ్మం అభ్యర్థిగా రేణుక చౌదరి, నిజామాబాద్ నుండి మధుయాష్కి, మెదక్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ , మహబూబాబాద్ నాయకులపై ఒకటే కేసు ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే టిఆర్ఎస్ పార్టీ నుండి మహబూబాబాద్ అభ్యర్థి ఎం కవిత, నిజామాబాద్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత లపై కూడా ఒకటే కేసు నమోదు అయినట్లుగా వారు అఫిడవిట్లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+