Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ఆర్టీపీ రాజకీయ వ్యూహకర్తగా ఆయనే: పూర్తిస్థాయిలో గ్రౌండ్ వర్క్: షర్మిల లక్ష్యం అదే

హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. గేరు మార్చారు. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నందున.. పార్టీ రాజకీయ కార్యకలాపాలపై ఇక పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఎన్నికల వరకు జనం మధ్యే ఉండాలని నిర్ణయించుకున్నారు. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. పక్కాగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైన కసరత్తు చేస్తోన్నారు. ఇందులో భాగంగా- రాజకీయ వ్యూహకర్తను సైతం నియమించుకున్నారు.

 ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో..

ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో..

తెలంగాణలో వచ్చే ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ- ఇక ఎన్నికల సంవత్సరంలోకి అడుగు పెట్టినట్టే. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి-కాంగ్రెస్-భారతీయ జనతా పార్టీ మధ్య త్రిముఖ పోరు ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆయా పార్టీల నాయకులందరూ క్రమంగా ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారిస్తోన్నారు. టీఆర్ఎస్ ఇదివరకే- ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల వరకు ఆయనతో కాంట్రాక్ట్‌ను కుదుర్చుకుంది.

 తెరపై వైఎస్‌ఆర్టీపీ..

తెరపై వైఎస్‌ఆర్టీపీ..

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీిని ధీటుగా ఎదుర్కొనడానికి వైఎస్ఆర్టీపీ ఎన్నికల వ్యూహాలను రూపొందించుకుంటోంది. దశాబ్దాల కాలంగా ఉంటోన్న ఈ మూడు పార్టీలను ఏకకాలంలో ఢీ కొట్టి.. నిలిచేలా పావులు కదుపుతోంది. అటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే- ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టేలా యాక్షన్ ప్లాన్‌కు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల- ఇక నిత్యం జనం మధ్య ఉండాలని నిర్ణయించుకున్నారు.

10 నుంచి ప్రజాప్రస్థానం పునరుద్ధరణ..

10 నుంచి ప్రజాప్రస్థానం పునరుద్ధరణ..

ఇదివరకు శాసన మండలి ఎన్నికల కోడ్ వల్ల మధ్యలో నిలిపివేసిన ప్రజాప్రస్థానం పాదయాత్రను వైఎస్ షర్మిల పునరుద్ధరించనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ పాదయాత్రను మళ్లీ చేపట్టనున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో పాదయాత్రను ఎక్కడ నిలిపివేయాల్సి వచ్చిందో.. అక్కడి నుంచే పునరుద్ధరించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. డిసెంబర్ 9వ తేదీన శాసన మండలి ఎన్నికల కోడ్ వల్ల నల్లగొండ జిల్లా కొండపాక గూడెం వద్ద వైఎస్ షర్మిల తన పాదయాత్రను నిలిపివేశారు. అక్కడి నుంచే మళ్లీ పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు.

 రాజకీయ వ్యూహకర్తగా..

రాజకీయ వ్యూహకర్తగా..

ఈ పరిణామాల మధ్య వైఎస్ షర్మిల- రాజకీయ వ్యూహకర్తను కూడా నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ శిష్యుడు రిషి రెడ్డిని అపాయింట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఐప్యాక్‌ టీమ్ సభ్యుడాయన. ఇదివరకు ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పని చేశారు. ఆయన బృందంలో కీలక సభ్యుడిగా వ్యవహరించారు. ఆయననే వైఎస్ షర్మిల- తన పార్టీ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన తన పని ప్రారంభించారని కూడా తెలుస్తోంది. ఇప్పటికే నియమించుకున్న స్ట్రాటజిస్ట్‌లతో కలిసి ఆయన పని చేస్తారని సమాచారం.

Recommended Video

    YSR Telangana Party celebrates registration by EC | Oneindia Telugu
     సునీల్ కానుగోలుతో టీడీపీ..

    సునీల్ కానుగోలుతో టీడీపీ..

    టీఆర్ఎస్‌కు ఇదివరకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ కానుగోలును తెలుగుదేశం పార్టీ నియమించుకుంది. గతంలో నియమించుకున్న రాబిన్ శర్మను తప్పించి ఆయన స్థానంలో సునీలో కానుగోలును అపాయింట్ చేసినట్లు వార్తలొచ్చాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక విషయంలో రాబిన్ శర్మ స్ట్రాటజీలు పెద్దగా ఫలించకపోవడం వల్ల ఆయనను తప్పించిందనే ప్రచారం సాగింది. సునీల్ కానుగోలు రాజకీయ వ్యూహాలపై పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి విశ్వాసం ఉన్నట్లు చెబుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+