Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IRCTC అరుణాచల మోక్ష యాత్ర - కాంచీపురం, అరక్కోణం సహా.. క్షేత్రాలు, ప్యాకేజీ..!!

అరుణాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. అరుణాచలం దర్శనం కోసం దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్య లో భక్తులు తరలి వస్తున్నారు. వీరి కోసం రైల్వే ఈ మధ్య కాలంలో ప్రత్యేక రైళ్లను పలు ప్రాంతాల నుంచి ఏర్పాటు చేస్తోంది. కాగా, ఐఆర్సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర పేరుతో మరిన్ని పుణ్య క్షేత్రాలను కలిపి ప్యాకేజీగా ప్రకటించింది. మొత్తం ఐదు రోజులపాటు సాగే ఈ టూర్​ లో పలు ప్రాంతాలను కూడా సందర్శించి రావచ్చు. హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఐఆర్సీటీసీ వెల్లడించింది.

ఐఆర్సీటీసీ "అరుణాచల మోక్ష యాత్ర" ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ 4 రాత్రులు, 5 పగళ్లు కొనసాగనుంది. కాచిగూడ స్టేషన్ రైల్వే స్టేషన్ (హైదరాబాద్) నుంచి రైలు బయల్దేరుతుంది. ఈ రైలులు స్లీపర్, 3AC బెర్తులు ఉంటాయి. పుదుచ్చేరి : అరబిందో ఆశ్రమం, ఆరోవిల్లె, ప్యారడైజ్ బీచ్ ప్రదేశాలను ప్యాకేజీలో ప్రకటించారు. తిరువన్నామలై లో అరుణాచలేశ్వర దేవాలయం సందర్శనతో పాటుగా కాంచీపురం లో కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయం దర్శనం ఉంటుంది. మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం 5 (17:00) గంటలకు కాచిగూడ పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (17653) బయలుదేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ సాగుతుంది. రెండో రోజు ఉదయం 11:05 గంటలకు పుదుచ్చేరి స్టేషన్ చేరుకుంటారు.

 వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!
irctc-latest-announcement-over-arunachalam-yatra-package-includes-famous-temples-here-the-details

పుదుచ్చేరీలో హోటల్‌ లో చెక్ ఇన్ అయిన తర్వాత ఫ్రైషప్ అవుతారు. ఆ తర్వాత ఆరోవిల్లె, అరబిందో ఆశ్రమం, పారడైజ్ బీచ్ సందర్శిస్తారు. రాత్రి బస అక్కడే ఏర్పాటు చేసారు. మూడో రోజు : ఉదయం అల్పాహారం చేసిన తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడి నుంచి తిరువన్నమలైకి బయలుదేరుతారు. అక్కడ దిగిన తర్వాత హోటల్​ కి తీసుకెళ్తారు. ఫ్రెషప్ అయిన తర్వాత అరుణాచలం ఆలయ సందర్శనకు వెళ్తారు. రాత్రి బస తిరువన్నమలై లోనే ఉంటుంది. నాలుగో రోజు : ఉదయం హోటల్‌లోనే అల్పాహారం చేస్తారు. అనంతరం చెక్ అవుట్ చేసి 120 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాంచీపురం బయలుదేరుతారు. అక్కడ కామాక్షి అమ్మన్ టెంపుల్, ఏకాంబరేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 30 కిలోమీటర్ల దూరంలోని అరక్కోణం చేరుకుంటారు.

ఇరాన్ తో యుద్దం వేళ ట్రంప్‌కు వ్యతిరేకంగా, 'నో కింగ్స్'- అమెరికా రోడ్ల పైకి లక్షల మంది..!!
ఇరాన్ తో యుద్దం వేళ ట్రంప్‌కు వ్యతిరేకంగా, 'నో కింగ్స్'- అమెరికా రోడ్ల పైకి లక్షల మంది..!!

ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు

కాగా, అక్కడి రైల్వే స్టేషన్లో సాయంత్రం 6.05 గంటలకు హైదరాబాద్​ కు ట్రైన్ బయలుదేరు తుంది. రాత్రంతా ప్రయాణం సాగుతుంది. ఐదో రోజు : ఉదయం 07:50 గంటలకు ట్రైన్ కాచి గూడ చేరుకుంటుంది. దీంతో టూర్ ముగుస్తుంది. ఇక..ప్యాకేజ్ ధరలు : కంఫర్ట్ (3AC) ట్విన్ షేరింగ్ - ఒక్కరికి రూ.19,130, ట్రిపుల్ షేరింగ్ - ఒక్కరికి రూ.14,740, 5-11 ఏళ్ల పిల్లలు - విత్ బెడ్ రూ.10,700, వితౌట్ బెడ్ రూ.8,060 గా నిర్దారించారు. స్టాండర్డ్ (SL) : ట్విన్ షేరింగ్ - ఒక్కరికి రూ.17,060, ట్రిపుల్ షేరింగ్ - ఒక్కరికి 12,670, 5-11 ఏళ్ల పిల్లలు - విత్ బెడ్ రూ.8,630, వితౌట్ బెడ్ రూ.5,980గా వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+