చూడటానికి ఇనుప రాడ్ ... లోపల బంగారం ...షాక్ అయ్యేలా ఎయిర్ పోర్ట్ లో స్మగ్లింగ్
కాదేది స్మగ్లింగ్ కు అనర్హం అని నిరూపిస్తున్నారు స్మగ్లర్లు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , స్మగ్లర్లు భద్రతా వ్యవస్థ కళ్లుగప్పి బంగారం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం తరలించే ముఠాలతో ఎయిర్ పోర్ట్ అధికారులు షాక్ కు గురవుతున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకోవటం నిత్య కృత్యమైపోయింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ పోర్ట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొన్నటికి మొన్న మస్కట్ నుండి ప్లేట్ల రూపంలో హైదరాబాద్‌కు తరలిస్తున్న 2.75 కిలోల బంగారంతో పాటు నిందితులను పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన ఎయిర్ పోర్ట్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇక తాజాగా ఇనుప రాడ్ లో బంగారం స్మగ్లింగ్ కి పాల్పడిన స్మగ్లర్ గుట్టు రట్టు చేశారు ఎయిర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు .

ఇన్నాళ్లూ బట్టల్లో , బ్యాగుల్లో,మొబైళ్లలో, శరీర భాగాలలో సైతం బంగారం దాచి తెచ్చిన ముఠాల గురించి విన్నాం. ఇప్పుడు తాజాగా ఇనుప రాడ్ లో అత్యంత భద్రంగా బంగారం దాచి స్మగ్లింగ్ కు పాల్పడిన వ్యక్తి ఉదంతం ఎయిర్ పోర్ట్ అధికారులను షాక్ కు గురి చేసింది. అతని వద్ద ఉన్న రాడ్ పగలగొట్టి చూస్తే అందులో బంగారం బయటపడింది. విదేశాల నుంచీ హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుణ్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు పట్టుకున్నారు. అతని దగ్గరున్న ఇనుప రాడ్డులను పగలగొట్టి చూసిన ఎయిర్ పోర్ట్ పోలీసులకు మైండ్ బ్లాంకైంది. రాడ్ల మధ్యలో బంగారం దాచి, స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. మొత్తం 2 కేజీల 300 గ్రాముల బంగారాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications