రేవంత్‌రెడ్డికి, కేటీఆర్‌కు మధ్య తేడా అదొక్కటే? ఎప్పటికీ సీఎం అవలేడు!
రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. వారికి అది ఎంతో అవమానకరంగా అనిపించింది. రేవంత్ రాష్ట్రమంతటా తిరిగి కష్టపడి ప్రచారం చేసుకొని పార్టీని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోని ఎందరో సీనియర్ నాయకులు వారి నియోజకవర్గం దాటి బయటకు రాలేదు. తాము ఎంతో వ్యతిరేకించే రేవంత్ సీఎం కావడంతో కేసీఆర్ అసెంబ్లీకి రావడం మానుకున్నారు. ఉక్రోషం తట్టుకోలేని కేటీఆర్ ఇష్టమొచ్చినట్లుగా, ముఖ్యమంత్రి పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా, అహంకారంతో మాట్లాడటం, రేవంత్ ను తేలిక చేసి మాట్లాడటం చేస్తున్నారు.
సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకున్నారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కేటీఆర్ కేవలం సోషల్ మీడియానే నమ్ముకున్నారు. అదే గెలిపిస్తుందనుకున్నారు. విపరీతమై ప్రచారం చేశారు. అందులో రేవంత్ రెడ్డిపై దుష్ప్రచారం చేయడంతోపాటు హైడ్రాపై, కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తోందంటూ, ప్రభుత్వ పథకాలమీద తీవ్రమైన వ్యతిరేక ప్రచారం చేశారు. ఇంత వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. జూబ్లీహిల్స్ సర్వనాశనమైపోయినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. 2023లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయిన తర్వాత కొన్ని పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ కు ఆర్థిక సహకారం అందజేసి తమవైపు ప్రచారం చేయించుకునేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంవల్ల అప్పటికప్పుడు బాగా హైప్ వచ్చినట్లు కనపడుతుందికానీ అది తాత్కాలికం.

చెడ్డవాడితో సావాసం పుట్టి ముంచింది
ప్రజలు కేవలం ప్రధాన మీడియానే నమ్ముతారు. అందులోనే వార్తలనే నమ్ముతారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా కాకుండా ప్రధాన పత్రికలు, ఛానల్స్, వెబ్ సైట్స్, కొన్ని నమ్మకమైన యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మాత్రమే ప్రచారం చేశారు. అందులో ఆయన విజయం సాధించారు. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను నమ్మలేదు. ప్రధాన మీడియాలో వచ్చిన వార్తలనే నమ్మారు. ఓటేశారు. దీంతో బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయింది. రాజకీయాల్లో ఓర్పు ఉండాలి. అహంకారం, ఉక్రోషాలు, తట్టుకోలేని తనం, ఇప్పటికిప్పుడే ప్రత్యర్థి దిగిపోవాలనే తొందరపాటు తనంలాంటివి పనికిరావు.
ఒకప్పుడు మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్న కేటీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్స్ తోపాటు మరికొన్ని పనులవల్ల జగన్ తో సమానంగా చెడ్డ పేరు తెచ్చుకున్నారు. చెడ్డవాడితో సావాసం చేస్తే ఏమవుతుందో కేసీఆర్ కు, కేటీఆర్ కు బాగా తెలిసివచ్చింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి జారిపోయిది. అయినా ఇంత జరిగినా మారకుండా దుబాయ్ నుంచి వైసీపీతో కలిసి బీఆర్ఎస్ కూడా సంయుక్తంగా సోషల్ మీడియా వ్యవస్థను నడిపిస్తున్నట్లు బీఆర్ఎస్, వైసీపీ నాయకులు, కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ఈ తరహా ధోరణితో ఉండే కేటీఆర్ ఎప్పటికీ సీఎం అవలేడని ఆ పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.












Click it and Unblock the Notifications