రాహుల్ సిప్లిగంజ్ పాట కేసీఆర్ వినలేదా?ఆస్కార్ విజేతకు గుర్తింపు ఇదేనా?నిలదీసిన రేవంత్ రెడ్డి.!
హైదరాబాద్ : ఆస్కార్ విజేత రాహుల్ సిప్లిగంజ్ ను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రపంచ అత్యున్నత పాటగాడుగా ఆస్కార్ అందుకున్న రాహల్ సిప్లిగంజ్ కు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కు కొనసాగింపుగానే రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
శుక్రవారం సికింద్రాబాద్ బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ లాంఛింగ్, బ్రోచర్ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి.


పార్టీ తరపున 10 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ కు కోటి రూపాయల నగదును బహుమతి ఇస్తామన్నారు. జూన్ 2న రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ఉంటుందని, ఇందులో పెద్ద ఎత్తున పాల్గొనాలని విద్యార్ధులు, యువతకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.













Click it and Unblock the Notifications