వ్యక్తి ఖాతాలో రూ.17 కోట్లు: ఐటీ అధికారుల విచారణలో షాకింగ్ నిజాలు
ఒకే అకౌంట్ ద్వారా చెల్లింపులు నిర్వహిస్తూ పన్నులు ఎగ్గొడుతున్న ఖాతాను ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఇది హైదరాబాద్ కేంద్రంగా జరగ్గా.. ఐటీ దర్యాఫ్తు చేస్తోంది.
హైదరాబాద్: ఒకే అకౌంట్ ద్వారా చెల్లింపులు నిర్వహిస్తూ పన్నులు ఎగ్గొడుతున్న ఖాతాను ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఇది హైదరాబాద్ కేంద్రంగా జరగ్గా.. ఐటీ దర్యాఫ్తు చేస్తోంది.
ఐటీ శాఖ మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత హైదరాబాద్ నాంపల్లిలోని ఒక బ్యాంకు ఖాతాలో రూ.17 కోట్లు జమ అవడాన్ని ఐటీ అధికారులు గుర్తించారు.
ఖాతాదారుడిని పిలిచి విచారిస్తే ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధంలేదని, ఆ ఖాతా తన మిత్రుడు నిర్వహిస్తుంటాడని చెప్పాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం డబ్బు జమ చేసిన వ్యక్తిని పిలిచి విచారణ జరిపారు.

ఆ వ్యక్తి ముక్తియార్ గంజ్‌లో ధాన్యం వ్యాపారుల వద్ద లెక్కలు రాసే వాడని తేలింది. అతడిని ఐటీ అధికారులు మరింత లోతుగా విచారించారు. అప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.
అతడి అకౌంటులో వేసినట్టే ముక్తియార్‌గంజ్, మహారాజగంజ్, బేగంబజార్‌లలోని వివిధ రకాల వ్యాపారులు ఎవరో ఒక అనామకుడి ఖాతాలో పెద్దమొత్తంలో నగదు జమ చేస్తున్నారు. ఆ వెంటనే నగదును లాతూర్, ఉద్గిరి, అకోల తదితర ప్రాంతాల్లోని సరఫరాదారుల ఖాతాల్లోకీ ఆర్టీజీఎస్ ద్వారా మళ్ళిస్తున్నారు.
డబ్బు ముట్టిన వెంటనే సరఫరాదారులు హైదరాబాద్‌లోని వ్యాపారులకు సరుకు పంపిస్తున్నారు. ఈ సరుకుకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా ఇక్కడ అమ్ముకుంటున్నారు. ఏ వ్యాపారికి సరుకు కావాలంటే ఆ వ్యాపారి ఖాతా ద్వారా నగదు చెల్లించాలి. కానీ అలా జరగలేదు. కానీ పన్ను తప్పించుకునేందుకు ఇలా చేశారు.












Click it and Unblock the Notifications