KTR: మహబూబ్‍నగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం వేముల వద్ద ఎస్‌జీడీ కార్నింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్‌లను పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. గ్లాస్ ఇన్నోవేషన్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న కార్నింగ్, గ్లాస్ ప్యాకేజింగ్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న SGD ఫార్మా తమ ప్రపంచ స్థాయి సౌకర్యాన్ని నిర్మించడానికి తెలంగాణను ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందని కేటీఆర్ అన్నారు.
"కార్నింగ్‌తో భాగస్వామ్యం మా ఆఫర్‌లు, సేవల యొక్క SGD ఫార్మా యొక్క కొనసాగుతున్న పరిణామంలో మరో దశను సూచిస్తుంది. మా అధిక-నాణ్యత గొట్టపు గాజు ప్యాకేజింగ్ యొక్క మా పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తుంది" అని SGD CEO ఒలివర్ రూసో చెప్పారు. ఆ తర్వాత పిల్లలమర్రి రోడ్డులో ఉన్న బాలికల ఐటీఐ కళాశాలలో సెయింట్ ఫౌండేషన్న, శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హెలికాప్టర్ నుంచి ఉద్దండాపూర్, కరివెన ప్రాజెక్టులను చూపించారని కేటీఆర్ చెప్పారు. ఈ ప్రాజెక్టులు నిండితే 1.44లక్షల ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయన్నారు. గత ఎన్నికల్లో లక్ష్మారెడ్డిని 45వేల మెజారిటీతో గెలిపించారని.. ఇప్పుడు 90 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు.












Click it and Unblock the Notifications