హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా, ఘన స్వాగతం: రోడ్డు మార్గంలోనే ట్రైడెంట్ హోటల్‌కు
గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌లో పాల్గొననున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామును మూడు గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
Recommended Video

హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్‌లో పాల్గొననున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామును మూడు గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఆమెకు తెలంగాణ మంత్రులు, అధికారులు, ఇవాంకాకు అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్, కాన్సులేట్ జనరల్ కేథరీన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన హోటల్‌కు బయలుదేరారు. దాదాపు గంట అనంతరం మాధాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌కు చేరుకున్నారు. ట్రైడెంట్‌లో బస చేస్తారు.
చదవండి: 'కేసీఆర్! ఇవాంకాకు రూ.కోటి నగ అవసరమా': కనుసైగ చేస్తే కరిచి చంపేసే జాగిలాలు

మధ్యాహ్నం గం.2.50 వరకు హోటల్లోనే
ఇవాంక మధ్యాహ్నం గం.2.50 వరకు ట్రైడెంట్ హోటల్‌లోనే ఉంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుంటారు. హెచ్ఐసీసీలోని రెండో అంతస్తులో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ అవుతారు.

మోడీని మర్యాదపూర్వకంగా కలుస్తారు
ఇవాంక రాక సందర్భంగా హైదరాబాదులో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ కూడా హైదరాబాద్ వస్తారు. మియాపూర్ లో మెట్రో రైలు ప్రారంభించిన అనంతరం ప్రధాని హెలికాప్టర్ ద్వారా హెచ్ఐసీసీకి చేరుకుంటారు. ప్రధానిని ఇవాంకా మర్యాదపూర్వకంగా కలుస్తారు.

తర్వాత రోజు దుబాయ్‌కి ఇవాంక
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభించిన అనంతరం మోడీ, ఇవాంకాలు ఫలక్‌నుమా ప్యాలెస్ చేరుకుంటారు. గ్లోబల్ సదస్సుకు హాజరయ్యే సుమారు 1500 మంది ప్రతినిధులను 45 బస్సుల్లో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వస్తారు. తర్వాత 29న కూడా ఇవాంకా సమ్మిట్‌లో పాల్గొని, రాత్రి దుబాయ్ బయలుదేరుతారు.

29వ తేదీ మధ్యాహ్నం ఎక్కడికి వెళ్తారు?
ఇవాంకా 29వ తేదీ ఉదయం హెచ్ఐసీసీలోని సదస్సుకు హాజరై, మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయటకు వెళ్తారు. ఆమె ఎక్కడికి వెళ్తారనే విషయాన్ని భద్రత బలగాలు రహస్యంగా ఉంచుతున్నాయని తెలుస్తోంది.
చదవండి: ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన కథనాలు
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications