టిఆర్ఎస్‌లోకి భువనగిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్: అభివృద్ధిని చూసేనన్న జగదీశ్ రెడ్డి
హైదరాబాద్/నల్గొండ: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చేస్తున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. భువనగిరికి చెందిన వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు మంగళవారం టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భువనగిరి దశాబ్దాలుగా వివక్షకు గురైందని అన్నారు. నల్గొండలో చాలా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు.
ముఖ్యమంత్రితో మాట్లాడి డబుల్ బెడ్‌రూం ఇళ్లను భువనగిరికి ఎక్కువగా మంజూరు చేయిస్తామని మంత్రి జగదీష్ తెలిపారు. నల్గొండ జిల్లాలో అభివృద్ధిని చూసి పలువురు టిఆర్‌ఎస్ బాట పడుతున్నరని ఆయన అన్నారు.

టిఆర్‌ఎస్‌లోకి భువనగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్
నల్గొండ జిల్లా భువనగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ సుర్విలావణ్య టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. నల్గొండ మంగళవారం జరిగిన పార్టీ కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. రేవన్‌పల్లి ఎంపీటీసీ శోభా శ్రీనివాస్‌తో పాటు బిజెపి, తెలుగుదేశం పార్టీకి 14 మంది కౌన్సిలర్లు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఎల్లంపల్లి పునరావాస సమస్యలపై హరీశ్ సమీక్ష
కరీంనగర్ జిల్లాలో గల ఎల్లంపల్లి ప్రాజెక్టు పునరావాస సమస్యలపై మంత్రి హరీశ్‌రావు మంగళవారం సమీక్ష చేపట్టారు. సమీక్ష సందర్భంగా చెగ్యాం, ఉండేడా, ముకరావుపేటలో పరిహారంపై దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు.
బిల్లు అంచనాలు పూర్తైన ఇళ్లకు 10 రోజుల్లో చెల్లింపులు చేయాలన్నారు. అదేవిధంగా మేడారం చెరువును జలాశయంగా మార్చే పనులు ప్రారంభించాలని సూచించారు. జూన్ 2016 నాటికి ఎల్లంపల్లి ద్వారా 1.5 లక్షల ఎకరాలకు నీరిచ్చే విధంగా ముందుకు సాగాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.












Click it and Unblock the Notifications