BRS: బీఆర్ఎస్‍కు రాజీనామా చేసిన జగదీశ్వర్ గౌడ్, పూజిత దంపతులు..
బీఆర్ఎస్ పార్టీని పలువురు నేతలు విడిచిపెడుతున్నారు. తాజాగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాకిచ్చారు కార్పొరేటర్లు. బీఆర్ఎస్ కు మాదాపూర్, హఫీజ్‌పేట డివిజన్ల కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత దంపతులు సోమవారం రాజీనామా చేశారు. వారు కాంగ్రెస్ లో చేరనున్నట్లు చేరనున్నారు. జగదీశ్వర్ గౌడ్, పూజిత దంపతులు మంగళవారం జూబ్లీహిల్స్పెద్దమ్మ గుడిలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పూజలు చేస్తారు. ఆ తర్వాత భారీ ర్యాలీగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లో చేరుతారు.
జగదీశ్వర్ గౌడ్ కొంతకాలంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే బీఆర్ఎస్ అధిష్ఠానం మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే బీఆర్ఎస్ టికెట్ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటించిన నాటి నుంచి జగదీశ్వర్ గౌడ్ టికెట్ కోసం బీఆర్ఎస్ పెద్దలను కలిసే ప్రయత్నం చేశారు. తాజాగా బీఆర్ఎస్ అరెకపూడి గాంధీకి బీఫామ్ అందించింది. దీంతో జగదీశ్వర్ గౌడ్ పార్టీని వీడారు.

గతంలో కూడా జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ కు వెళ్తారన్న వార్తలు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ అధిష్ఠానం జగదీశ్వర్ గౌడ్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ను చేసింది. కాంగ్రెస్ నుంచి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్ జగదీశ్వర్ గౌడ్ కు కన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వారు జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ చేరుతున్నట్లు సమాచారం. జగదీశ్వర్ గౌడ్ కు మాదాపూర్, హఫీజ్‌పేట్ లో మంచి పట్టు ఉంది. అంతేకాకుండా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంచి పేరు కూడా ఉంది. దీంతో జగదీశ్వర్ గౌడ్ పార్టీ మారడం బీఆర్ఎస్ ఎదురు దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పటాన్ చెరు టికెట్ ఆశించిన నీలం మధు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. 22 సంవత్సరాలుగా పార్టీకి సైనికుడిలా సేవలందించిన బీఆర్ఎస్ పార్టీ తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2001లో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని స్థాపించిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ అభ్యున్నతికి కృషి చేశానని మధు గుర్తు చేశారు. 2014లో పటాన్ చెరు జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాని పక్షంలో ధైర్యంగా ఆనాడు జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా స్వగ్రామం చిట్కుల్‌లో రెండు ఎంపీటీసీలను గెలిపించానని తెలిపారు.












Click it and Unblock the Notifications