టీపీసీసీ అధ్యక్ష పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో వివాదాస్పద సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీపిసిసి అధ్యక్ష పదవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారం రోజుల క్రితం టీపీసీసీ చీఫ్ అధ్యక్ష పదవికి తనకు అర్హత ఉన్నట్లుగా ప్రకటించుకున్న జగ్గారెడ్డి తన బయోడేటాను కూడా పంపించినట్టు గా తెలిపారు. ఇక తాజాగా టీ పిసిసి పదవికి పార్టీలో అన్ని వర్గాల వారికి హక్కుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

తమ పార్టీలో పేద ధనిక అన్న తేడాలు లేవని, అందరూ సమానమే అని చెప్పిన జగ్గారెడ్డి సామాన్య కార్యకర్త సైతం పిసిసి చీఫ్ అధ్యక్ష పదవికి అర్హులే నని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాల వారు ఉన్నారని, వారిలో సమర్థులైన నేతలు చాలామంది ఉన్నారని పేర్కొన్న జగ్గారెడ్డి సామాన్య కార్యకర్త బాలకిషన్ కూడా పిసిసి అధ్యక్షుడు అవకాశముందని వ్యాఖ్యానించారు. పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వమని అడిగే హక్కు ప్రతి కార్యకర్తకు ఉందని ఆయన పేర్కొన్నారు.

Jagga Reddy made interesting comments on the TPCC chief post

రెడ్లు బ్రాహ్మణులే కాదు బీసీలలోనూ సమర్థవంతంగా పనిచేసేవారని ఆయన పేర్కొన్నారు. బీసీలలో సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు ఉన్నారని జగ్గారెడ్డి అన్నారు. ఇక ఎస్సీల లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహ, మాల సామాజిక వర్గం చెందిన భట్టి విక్రమార్క ఉన్నారని పేర్కొన్నారు. ఏదేమైనా తాను సైతం టీపిసిసి అధ్యక్ష రేసులో ఉన్నానని చెప్పుకున్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.ఇక గతంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా తనకు అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ హై కమాండ్ ను కోరారు జగ్గారెడ్డి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+