అమ్ముడు పోయేవాడ్ని కాదు ..ఆ పదవి నాకివ్వండి .. టీపీసీసీ అధ్యక్ష పదవిపై జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన పార్టీ విషయంలోనూ , సీఎం కేసీఆర్ విషయంలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు . ఇక గతంలో కాంగ్రెస్ పార్టీ వార్కంగ్ ప్రెసిడెంట్ పదవి తనకు ఇవ్వాలని కోరిన జగ్గారెడ్డి ఇప్పుడు ఏకంగా టీపీసీసీ చీఫ్ గా తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు . సొంత పార్టీ నేతల పైన అయినా సరే ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జగ్గారెడ్డి తాజాగా తనకు టీపీసీసీ అధ్యక్ష పదవి కావాలని తన మనసులోని మాట బయటపెట్టారు .

గత కొంత కాలంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త టీపీసీసీ అధ్యక్షుడు ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది . ఇక ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. టీపీసీసీ అధ్యక్షుడిని మార్చి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే చర్చ జరుగుతోందని పేర్కొన్న ఆయన ఢిల్లీలో టీపీసీసీ మార్పుపై చర్చ జరుగుతున్నదనే సమాచారం తనకు ఉందన్నారు. టీపీసీసీ చీఫ్ రేసులో తన పేరు కూడా ఉందని జగ్గా రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడు అధ్యక్షుడిని మార్చాలి అనుకున్నా, తనకు అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు.

Jagga Reddy revealed his desire to Give a chance as TPCC president

ఈ విషయంలో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి తన విజ్ఞప్తిని తెలియజేస్తున్నానని అన్నారు. తనకు అవకాశం ఇస్తే పార్టీ సీనియర్ల సహకారంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు తాను అమ్ముడు పోయే వ్యక్తిని కాదు అని తన గురించి తెలుసుకోవాలంటే కెవిపిని కానీ, కిరణ్ కుమార్ రెడ్డిని గానీ అడగాలని, తన గురించి వారు పూర్తిగా చెప్తారని జగ్గారెడ్డి అంటున్నారు. తనకు టీపీసీసీ అధ్యక్షునిగా పదవి ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, పార్టీని ముందుకు నడిపిస్తానని చెప్పారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. జగ్గారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో మరోమారు టీపీసీసీ అధ్యక్ష పదవిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+